
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను కేవలం పన్నులు వసూలు చేసే వనరులుగానే పరిగణిస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్ ధర 138 డాలర్లకు చేరినప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 94.77గా ఉండేదని ఖర్గే గుర్తుచేశారు. ప్రస్తుతం క్రూడ్ ధర 70 నుంచి 82 డాలర్ల మధ్య ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధర రూ. 101 - 111, డీజిల్ ధర రూ. 95 - 100 మధ్య కొనసాగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు.బీజేపీ ప్రభుత్వం సామాన్యుల జేబులు ఖాళీ చేస్తూ ప్రజలను దోచుకుంటోందని ఖర్గే ధ్వజమెత్తారు. ప్రజలను కేవలం పన్నుల వసూలు సాధనంగానే కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ ధరలను రెట్టింపు చేసిందని, ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి వచ్చినా ధరలను ఎందుకు తగ్గించడం లేదని ఆయన నిలదీశారు.భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. గతంలో చమురు ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, గత నష్టాలను పూడ్చుకోవడం, దిగుమతి