
మీరు 30 ఏళ్ల వయసులో ఉండి, ప్రస్తుతం నెలకు రూ.50,000 ఖర్చు చేస్తున్నారా? అయితే, మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలంటే మీకు సుమారు రూ.9 కోట్ల నిధి అవసరం.
ఇది ఆశ్చర్యంగా అనిపించినా, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక నిపుణులు చేస్తున్న వాస్తవిక అంచనా ఇది. చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలుపెట్టడం ఎంత ముఖ్యమో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, వైజ్ ఫిన్సర్వ్ డైరెక్టర్ చారు పహుజ ప్రకారం.. 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని, ఆ తర్వాత మరో 30 ఏళ్లు జీవిస్తారని అంచనా వేసుకుంటే, సగటున 6 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం ఈ మొత్తం అవసరమవుతుంది. ప్రస్తుతం నెలకు రూ.50,000 ఖర్చు, 30 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా నెలకు రూ.2.87 లక్షలకు పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చులు పెరుగుతాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన ఆదాయం), దీనికి రూ.8.94 కోట్ల కార్పస్ అవసరం. ఇందుకు నెలకు సుమారు రూ.32,000 మదుపు (SIP) చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మీ ప్రస్తుత నెలవారీ ఖర్చు రూ.75,000 అయితే, మీకు రూ.13.41 కోట్ల నిధి అవసరం. అదే రూ.1,00,000 ఖర్చు చేసేవారికి రిటైర్మెంట్ నాటికి రూ.17.88 కోట్లు కావాలి. ఈ భారీ మొత్తాలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్న వయసులో క్రమం తప్పకుండా SIP మార్గంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చక్రవడ్డీ ప్రభావంతో లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.అయితే, ప్రతి ఒక్కరి ఆర్థిక