
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Undavalli YCP Leaders Visit: రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీఆర్డీఏ పరిరక్షణ బృందం చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద పర్యటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను కూటమి సానుభూతిపరులు, అమరావతి రాజధాని రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
'గో బ్యాక్ వైసీపీ' నినాదాలు.. వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరుల బృందం రాజధాని భూములను పరిశీలించేందుకు ఉండవల్లి సెంటర్ వద్దకు చేరుకుంది. అయితే, వీరి రాకను తీవ్రంగా నిరసిస్తూ స్థానిక రైతులు, కూటమి కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి అడ్డుకున్నారు. "గో బ్యాక్ వైసీపీ" అంటూ భారీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి, అది కాస్తా పరస్పర తోపులాటకు దారితీసింది.
కోడిగుడ్లు, రాళ్లతో దాడి.. ఉద్రిక్తత అంతటితో ఆగకుండా మరింత తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కోడిగుడ్లు విసిరారు. ఈ గందరగోళంలో వైసీపీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆయన వాహనం అద్దాలు పగిలి, తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులను కూడా వదలకుండా వారిపైకి రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
ఉండవల్లి ప్రాంతం రణరంగంగా మారడంతో పోలీసులు అక్కడ అదనపు బలగాలను భారీగా మోహరించారు. ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర ఉద్వేగభరిత, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.