
బూర్గంపహాడ్, జూన్ 27 : పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీఓ సుధీర్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీఓ మద్ది...
బూర్గంపహాడ్, జూన్ 27 : పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీఓ సుధీర్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీఓ మద్ది రామకృష్ణతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, కార్యదర్శి సరోజ, సిబ్బంది పాల్గొన్నారు.