
భారీ స్టార్స్‌ను పెట్టి సినిమాలు తీసే క్రమంలో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోతోందని, ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తోంది.
ఇదే వ్యవహారంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఒక తాజా పాడ్ క్యాస్ట్ వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
భారీ స్టార్స్‌ను పెట్టి సినిమాలు తీసే క్రమంలో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోతోందని, ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తోంది. ఇదే వ్యవహారంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఒక తాజా పాడ్ క్యాస్ట్ వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిత్రాల మార్కెట్ పరిధి, బిజినెస్ రేంజ్ గురించి తానే స్వయంగా హీరోలకు ముందే స్పష్టత ఇస్తానని, బడ్జెట్ పరిమితులను దాటి పారితోషికాలు ఇవ్వడం తన వల్ల కాదని, తన ఆలోచనలతో సింక్ అయ్యే హీరోలతోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతానని దిల్‌రాజు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశాడు. తమకున్న క్రేజ్, మార్కెట్ వాల్యూ ఎక్కడ పడిపోతుందో అనే భయంతోనే చాలామంది స్టార్స్ తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడానికి వెనుకాడుతుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు.
ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. ఒక రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు భారీ మొత్తాన్ని కేవలం ఒక హీరో పారితోషికానికే కేటాయించాల్సి రావడం మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుసరిస్తున్న సరికొత్త బిజినెస్ మోడల్‌ను ఉదాహరణగా చూపించాడు. హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ముందస్తుగా పెద్ద మొత్తంలో క్యాష్ అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం కంటే, సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే నికర లాభాల్లో వాటా తీసుకునేందుకు అక్కడి స్టార్స్ ఆసక్తి చూపుతున్నారని, ఈ తరహా పద్ధతి వల్ల నిర్మాతలకు ఆర్థిక రిస్క్ చాలా వరకు తగ్గుతుందని, ఒకవేళ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తే హీరోలకు కూడా ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయని, పొరపాటున ప్రాజెక్ట్ విఫలమైనా మేకర్స్ పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చాడు.
ఈ వినూత్న లాభాల వాటా ఫార్ములాను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎలా వాడుతున్నాడో కూడా దిల్‌రాజు ఈ సందర్భంగా గుర్తుచేశాడు. గతంలో ఒక్కో సినిమాకు దాదాపు రూ.130 కోట్ల వరకు డిమాండ్ చేసిన అక్షయ్, మారుతున్న మార్కెట్ ఒడిదుడుకులను గమనించి ఇప్పుడు పూర్తిగా ప్రాఫిట్ షేరింగ్ వైపు అడుగులు వేశాడు. ఈ విధానం అమలులోకి రావడం వల్ల కేవలం నిర్మాతలకు పెట్టుబడి భద్రత లభించడమే కాకుండా, హీరోలకు కూడా ప్రాజెక్ట్ సక్సెస్ పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ తరహా కల్చర్ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదని, రాబోయే రోజుల్లో టాలీవుడ్ కూడా ఇదే హెల్తీ బాటలో పయనిస్తేనే పరిశ్రమ ఆర్థికంగా ఎంతో ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటుందని దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశాడు.