టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్‌కు పరిమితం కాదని, టెస్టు క్రికెట్లోనూ రాణించగల సత్తా అతడికి ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్‌ను ఆడించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, అతడిని కేవలం వైట్-బాల్ స్పెషలిస్ట్‌గా మాత్రమే చూడవద్దని ఆయన సూచించాడు. ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం లభించవచ్చని జోస్యం చెప్పాడు. వైభవ్ కేవలం టీ-20లు మాత్రమే ఆడగలడని, వన్డేలు, టెస్టులకు పనికిరాడని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను వెంగీ ఈ సందర్భంగా కొట్టిపారేశాడు.బీహార్‌కు చెందిన వైభవ్, 12 ఏళ్ల ప్రాయంలోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ముఖ్యంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో, కేవలం 38 బంతుల్లోనే సెంచరీ బాది టీ20ల్లో పిన్న వయస్కుడైన శతకవీరుడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.అయితే, వైభవ్ ఫస్ట్-క్లాస్ రికార్డు సాధారణంగా ఉండటంతో, అతను టెస్టులకు సరిపోతాడా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వెంగ్‌సర్కార్ స్పందిస్తూ, "అతడిలో అసాధారణ ప్రతిభ ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా గొప్ప ప్రదర్శన చేస్తాడు" అని ధీమా వ్యక్తం చేశాడు.