
AI వచ్చాక దర్శక నిర్మాతలకే కాదు.. హీరోలకు కూడా చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడు AI అంటున్నారు ఆడియన్స్.
దీంతో మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్ మాది AI కాదు.. మేమే కష్టపడి తీశాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లెవరో చూద్దామా..? ఈ మధ్య సీనియర్ హీరోల సినిమాల్లోంచి ఏది విడుదలైనా AI అంటున్నారు.. అందుకే రజినీ ప్రతీసారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. తాజాగా ధర్మన్ లుక్ AI ఎడిట్ అనే విమర్శలు వస్తున్న వేళ.. అదేం కాదు తానే సొంతంగా చేసాను.. ఒరిజినల్ అని నిరూపించుకోడానికి రజినీ లుక్ టెస్ట్ వీడియో విడుదల చేసారు మేకర్స్. గతంలో నెల్సన్ సినిమాకు ఇదే జరిగింది. నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ కలిసి చేసిన ప్రోమో AI మాయ అని ట్రోల్స్ మొదలైన కొన్ని గంటలకే.. ఇది రియల్ అని నిరూపించడానికే మేకింగ్ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది మేకర్స్‌కు..! రాజమౌళికి సైతం ఈ AI టెన్షన్ తప్పట్లేదు.. వారణాసి టీజర్లో AI వాడారనే కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అవుతూ.. ఏడాదిన్నర పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించొద్దన్నారు. స్వయంభు విషయంలో నిఖిల్ సైతం తమది AI కాదని.. మిగితా సినిమాల్లా షార్ట్ కట్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వాడలేదంటూ సెటైర్ వేసారు. టెక్నాలజీ పెరగడం మంచిదే కానీ.. నిజమైన కష్టానికి గుర్తింపు దక్కాలంటే మేకర్స్ ఇలా మేకింగ్ వీడియోలు, బైట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందేమో..?
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు
Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!