టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ అంది
ంచిన సంభాషణలు, కథలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశారు. దాంతో వీరిద్దరి పూర్తి స్థాయి కలయికలో ఒక సినిమా చూడాలని చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ కల నిజం చేస్తూ వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ ( AK47 ) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.* ‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చే ప్రసక్తే లేదు: నెగెటివ్ ట్రోల్స్‌కు బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్వెంకటేష్ కెరీర్లో 77వ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ను గాంధీ జయంతి సందర్భంగా, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా “ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి” అంటూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక మధ్యతరగతి కుటుంబానికి పెద్దగా, ఇద్దరు పిల్లల తండ్రిగా ఒక వైవిధ్యమైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు. కుటుంబ అంశాలతో ముడిపడిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.* ‘అది ఫేక్ అని జనాలకి తెలుసు’... ‘గేమ్ ఛేంజర్’ రూ.186 కోట్ల పోస్టర్‌పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్! టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తుండగా, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. టాలీవుడ్ బెస్ట్ టెక్నీషియన్లు అందరూ కలిసి పని చేస్తుండటం, పైగా వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొదటి డైరెక్టోరియల్ సినిమా కావడంతో ఈ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.