
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందింది. త్వరలో అతడు వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉన్నా, ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే...
Jun 27 2026 5:18 PM | Updated on Jun 27 2026 5:18 PM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందింది. త్వరలో అతడు వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉన్నా, ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే ఉన్నాడు. విరాట్ ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు పునరావాస కార్యక్రమంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో విరాట్ హ్యామ్‌స్ట్రింగ్‌కు గాయమైంది. గాయం ఉన్నప్పటికీ అతడు మొత్తం ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్టే.. కానీ..? ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు విరాట్ CoEలో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి చేశాడని, అతడికి క్లియరెన్స్ కూడా లభించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందుకే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం.
అయితే తాజాగా భారత అండర్-19 కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి విరాట్ CoEలో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఇంకా రిహాబిలిటేషన్లోనే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. విరాట్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడింది.
అసలు గాయం ఏంటి..? విరాట్‌కు డిస్టల్ సెమిమెంబ్రానోసస్ టెండన్ టియర్ అనే అరుదైన హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినట్లు సమాచారం. ఇది మోకాలి వెనుక భాగంలో ఉండే హ్యామ్‌స్ట్రింగ్ కండరానికి సంబంధించిన గాయం. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రతను బట్టి కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది.
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి
ఎక్కడా తగ్గేదే లేదు.. ప్రాణత్యాగానికైనా మేము రెడీ..
కేతన్ కు బట్టతల.. అందుకే చంపేసా.. విచారణలో సియా షాకింగ్ కామెంట్స్
షోయబ్ అక్తర్ సోదరుడి అంతక్రియల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు