అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా ప్రభుత్వం నుంచి పాక్షిక ఊరట లభించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవలే నిషేధించిన శక్తివంతమైన 'క్లాడ్ మైథోస్ 5' ఏఐ మోడల్‌ను...
అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్‌కు అమెరికా ప్రభుత్వం నుంచి పాక్షిక ఊరట లభించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవలే నిషేధించిన శక్తివంతమైన 'క్లాడ్ మైథోస్ 5' ఏఐ మోడల్‌ను పరిమితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎంపిక చేసిన కొన్ని విశ్వసనీయ అమెరికన్ సంస్థలకు మాత్రమే ఈ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది.సరైన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్న నేపథ్యంలో, విశ్వసనీయ భాగస్వాములకు క్లాడ్ మైథోస్ 5 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతిస్తున్నట్లు వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై ఆంథ్రోపిక్ స్పందిస్తూ, సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలకు వీలైనంత త్వరగా యాక్సెస్ కల్పిస్తామని వెల్లడించింది.ఈ నెల 12న మైథోస్ 5, ఫేబుల్ 5 అనే రెండు మోడళ్లపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏఐ మోడళ్లలోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు లేదా ఇతర దురుద్దేశపూరిత శక్తులు సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మైథోస్ 5 ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, పరిశోధనల కోసం ఉద్దేశించినది కాగా, ఫేబుల్ 5ను సాధారణ వినియోగదారుల కోసం అదనపు భద్రతా ఫీచర్లతో రూపొందించారు.గత కొద్ది రోజులుగా ఆంథ్రోపిక్ ప్రతినిధులు, వాణిజ్య శాఖ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ తాజా నిర్ణయం వెలువడింది. సుమారు 100 అమెరికన్ కంపెనీలు, ఫెడరల్ ఏజెన్సీలకు ఈ పరిమిత అనుమతి లభించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్