
ఓ ప్రముఖ బట్టల కంపెనీ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూపాయికే బ్రాండెడ్ డ్రెస్సులు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆ కంపెనీకి చెందిన బట్టల దుకాణం దగ్గరికి జనం భారీ సంఖ్యలో క్యూకట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రాండ్ ఏదైనా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్లు తప్పనిసరి. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రమోషన్స్ చేయటం చిటికెలో పని అయిపోయింది. మరీ ముఖ్యంగా బట్టల దుకాణాలు ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా, ఓ ప్రముఖ బట్టల కంపెనీ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూపాయికే బ్రాండెడ్ డ్రెస్సులు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆ కంపెనీకి చెందిన బట్టల దుకాణం దగ్గరికి జనం భారీ సంఖ్యలో క్యూకట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
న్యూమీ బట్టల కంపెనీ రూపాయికే బ్రాండెడ్ డ్రెస్సులు ఇస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవాలంటే మినిమం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. టోకన్ సిస్టమ్ ప్రకారం 1 నుంచి 50 నంబర్ వచ్చిన వారు మినిమం ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. 51 నుంచి 100 వరకు నంబర్ వచ్చిన వారు 500 రూపాయల విలువైన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 101 నుంచి 150 వరకు నంబర్ వచ్చిన వారు వెయ్యి రూపాయల విలువైన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 151 నుంచి మిగిలిన నంబర్ వచ్చిన వారు 1500 రూపాయల మినిమం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్ ముంబై, పుణెలలోని తమ స్టోర్లలో 27వ తేదీ అందుబాటులో ఉంటుందని న్యూమీ కంపెనీ సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ చేసింది. ఈ ఆఫర్ గురించి తెలియగానే జనం మలద్ వెస్ట్‌లోని న్యూమీ స్టోర్ దగ్గరకు క్యూకట్టారు. ఇన్ఫినిటీ మాల్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సుప్రీం కోర్టు తీర్పు.. దశాబ్దాల నాటి ఆస్తి తగాదాకు ఫుల్ స్టాప్