
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు యూకే మిలిటరీ వెల్లడించింది. ఆ నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
అయితే అది ఎవరు ప్రయోగించిన క్షిపణి అనేదానిపై స్పష్టత రాలేదు. హర్మూజ్ సమీపంలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది. మరోవైపు శుక్రవారం హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న చాలా ఖరీదైన వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. హర్మూజ్‌లో మరో ట్యాంకర్‌పై క్షిపణి దాడి |