
నగరాల్లో ఫ్లాట్లు కొనేవారికి బిల్డర్లు సమయానికి అప్పగించకపోవడంతో నష్టపోతున్నారు. ఈ ఆలస్యంపై ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఫ్లాట్ అప్పగించడంలో ఆలస్యమైతే దానికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఫ్లాట్ స్వాధీనం చేసుకొన్న తర్వాత కూడా జరిగిన ఆలస్యానికి కొనుగోలుదారుడికి పరిహారం కోరే హక్కు ఉందని చెప్పింది. గతంలో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్ని పక్కనబెట్టింది. ఫ్లాట్ అప్పగింతలో ఆలస్యానికి పరిహారం కోరవచ్చు: సుప్రీంకోర్టు |