డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ తప్పకుండా తీసుకెళ్లండి. చిన్న గాయాలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు వస్తే కష్టం.
కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను సేఫ్టీ కోసం వెంట పెట్టుకోండి.
వాటర్ బాటిల్స్ ఎక్కువగా పెట్టుకోండి. శరీరం హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అందుకే వాటర్ వెంట తీసుకెళ్లాలి.
పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్ వంటివి ప్రయాణంలో తప్పకుండా పెట్టుకోండి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి.
ఛార్జర్, పవర్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుకోండి. ఫోన్ బ్యాటరీ అయిపోతే కష్టం. అందుకే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జింగ్ పెట్టి తీసుకెళ్లండి.
మొబైల్ మ్యాప్స్ లేదా GPS డివైస్‌లు కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ లేకపోయినా వాటిని ఆఫ్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.
పిల్లలు ఉన్నవారు కచ్చితంగా అదనపు దుస్తులను తీసుకెళ్లండి. వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఉపయోగపడతాయి.
వర్షాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా గొడుగులు, రైన్ కోట్లు వంటివి తీసుకెళ్లండి.
పిల్లల కోసం కలరింగ్ బుక్స్, పుస్తకాలు, పజిల్స్, బోర్డ్ గేమ్స్ ఇలాంటివి తీసుకెళ్తే ప్రయాణం సరదాగా సాగుతుంది.