
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు.
మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు, లబ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా సమవేశమయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు.‘‘ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. సంకేశుల గ్యాప్ పనులను 1998లోనే ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కూడా మాలాగే చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. మార్కాపురం జిల్లాలో పండ్ల తోటలు బాగా రావాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ నేతలు దిట్ట. వైకాపా నేతలు కళ్లు ఆర్పకుండానే అబద్ధాలు చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు వితండవాదం చేస్తున్నారు. వెలిగొండ పేరుతో వైకాపా ప్రభుత్వం అనేక మోసాలు చేసింది. టన్నెల్-2లో బోరు ఇరుక్కు పోయినా ప్రాజెక్టును ప్రారంభించేశారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగం గొప్పది. మీరు ఇచ్చిన భూముల వల్ల నాలుగైదు జిల్లాలు బాగుపడతాయి. వెలిగొండ నీళ్లు వచ్చాక చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది. మాది ప్రజా ప్రభుత్వం.. అందరికీ లబ్ధి చేకూరుస్తాం. కరవు జిల్లా పరిస్థితులు తెలిసిన కలెక్టర్‌ను నియమించాం’’ అని సీఎం తెలిపారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రుల ఎన్నో ఏళ్ల కల.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.
కృష్ణాజిల్లా పామర్రులో భారీ వర్షం కురుస్తోంది.
ఆయన ఓ అథ్లెట్. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరినా పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు.