
అమరావతి: రాజధానిలో వైకాపా నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉండవల్లిలో వైకాపా నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
వైకాపా నేతలు గో బ్యాక్ అంటూ పెనుమాక, కృష్ణాయపాలెంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నాయకులతో ఆ పార్టీ.. రాజధాని పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు.
ఈ కమిటీ శనివారం రాజధాని ప్రాంతంలోని పెనుమాక పర్యటనకు రావడంతో రైతులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైకాపా నేతలు ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి వద్దకు రాగానే రైతులంతా వెళ్లి అడ్డుగా నిల్చున్నారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల పాటు కాలయాపన చేసి, అమరావతిని విధ్వంసం చేసిన వైకాపా నేతలకు రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని అంగీకరించిన తర్వాత మాత్రమే ఇక్కడ అడుగు పెట్టాలని స్పష్టం చేశారు. రైతులను తోసుకుంటూ వైకాపా నేతలు ముందుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆంధ్రుల ఎన్నో ఏళ్ల కల.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.
కృష్ణాజిల్లా పామర్రులో భారీ వర్షం కురుస్తోంది.
ఆయన ఓ అథ్లెట్. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరినా పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు.