
జుట్టు రాలిపోతుందని చాలామంది వెంటనే సప్లిమెంట్లు, విటమిన్ మాత్రల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ అసలు సమస్య శరీరంలో పోషకాల లోపం కావొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సరైన ఆహారం తీసుకుంటేనే జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని సూచిస్తున్నారు.జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్, ఐరన్, జింక్, విటమిన్-సి, ఒమెగా-3, విటమిన్-బి12 వంటి పోషకాలు తప్పనిసరిగా అవసరమని నిపుణులు తెలిపారు. ఏ ఒక్క ఆహారంతోనో జుట్టు రాలడం పూర్తిగా ఆగదని, కానీ పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.జుట్టు కోసం బయోటిన్ సప్లిమెంట్లకు బదులుగా రోజూ ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు తినాలని సూచించారు. వీటిలో ఉండే విటమిన్-ఈ, జింక్, సెలీనియం జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయని వివరించారు.ఐరన్ మాత్రలకు బదులుగా మునగాకు పొడి తీసుకోవాలని చెప్పారు. ఇందులో విటమిన్-ఏ, సీ, ఈతో పాటు ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉండి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయని తెలిపారు. ప్రొటీన్ పౌడర్లకు బదులుగా 100 గ్రాముల పనీర్‌ను ఆహారంలో చేర్చాలని సూచించారు. ఇందులోని ప్రొటీన్, విటమిన్-ఈ, సెలీనియం జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తాయని చెప్పారు.విటమిన్-సి మాత్రలకు బదులుగా ఉసిరికాయ తినడం మంచిదన్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ జుట్టు వేర్లను బలోపేతం చేసి, చుండ్రు, తెల్లజుట్టు సమస్యలను తగ్గించడంలో సాయపడతాయని వివరించారు.ఒమెగా-3 సప్లిమెంట్లకు బదులుగా రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకోవాలని చెప్పారు. అలాగే విటమిన్-బి12 కోసం పెరుగు తినాలని సూచించారు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ తలపై చర్మాన్ని శుభ్రంగా