
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Bala Baba Viral Video Watch Now: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకో వింతైన వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో కొన్ని సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తీవ్ర చర్చలకు దారితీస్తూ ఉంటాయి.. తాజాగా ఒక బాల బాబాకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నీటిపై ఉన్న నిమ్మకాయను ఒక బాల బాబా తన మాయతో పైకి లేపడం మీరు చూడొచ్చు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైరల్ వీడియోలో ఏముంది? వైరల్ అవుతున్న ఆ వీడియోను గమనిస్తే.. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బాల బాబా నీటిలో కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. అతని ముందు నీటిలో ఒక నిమ్మకాయ మునిగి ఉండడం మీరు చూడొచ్చు.. ఆ బాల బాబా తన చేతులను గాల్లో ఆడిస్తూ.. ఏదో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ.. కెమెరా వైపు చూడడం మీరు గమనించవచ్చు. అంతే, క్షణాల వ్యవధిలో నీటి అడుగున ఉన్న ఆ నిమ్మకాయ నెమ్మదిగా పైకి లేచి.. నీటిపై తేలడం మీరు చూడొచ్చు. తనకున్న అద్భుత శక్తులతోనే ఆ నిమ్మకాయను నీటిపైకి లేపాడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు..
నెటిజన్ల ట్రోలింగ్.. ఈ వీడియో ఊహించని స్థాయిలో వ్యూస్, లైకులను సంపాదించుకుంది.. కొందరు భక్తులు ఇది దైవ శక్తి.. బాల బాబా మహిమ అంటూ కామెంట్లు పెడుతుండగా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ వీడియో.. జనాలను మోసం చేయడానికి చేస్తున్న విన్యాసం అని కొంతమంది కామెంట్ చేయగా.. సైన్స్‌ను నమ్మండి, ఇలాంటి మూఢనమ్మకాలను కాదని మరొకరు కామెంట్లు రాసుకొచ్చారు.
మరికొందరు ఈ వీడియోను పూర్తిగా పరిశీలించి.. ఇది కేవలం వీడియో ఎడిటింగ్ ట్రిక్ లేదా గ్రాఫిక్స్ (VFX) అని కొట్టిపారేస్తున్నారు. నిమ్మకాయకు సన్నటి దారం కట్టి పైకి లాగడం లేదా రివర్స్ వీడియో టెక్నిక్ ఉపయోగించి ఉండవచ్చని కొంతమంది నెటజన్స్ అభిప్రాయపడుతున్నారు.
నిజానికి నీటిలో నిమ్మకాయ తేలడం వెనుక ఎలాంటి మంత్రాలు.. తంత్రాలు లేవని, ఇది కేవలం సాంద్రత (Density) ఆధారంగా జరిగే ఒక చిన్న సైన్స్ ప్రయోగమని నిపుణులు చెబుతూ వస్తున్నారు. సాధారణ నీటిలో నిమ్మకాయ మునుగుతుంది. కానీ.. ఆ నీటిలో ఎక్కువ మొత్తంలో ఉప్పు (Salt) కలిపితే నీటి సాంద్రత పెరుగుతుంది. అప్పుడు నిమ్మకాయ మునగకుండా పైకి తేలుతుందని అన్నారు. ఈ వీడియోలో కూడా బాల బాబా కూర్చున్న నీటిలో ఏదైనా కెమికల్ లేదా ఉప్పు కలిపి ఉండవచ్చని, లేదా కెమెరా ట్రిక్స్ వాడి ఉండవచ్చని వారు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.