
ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్.. పెట్రోల్.. వంట నూనెల నుంచి కూరగాయల ధరల వరకు కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో చికెన్.. గుడ్డు ధరలు పెరుగుతున్నాయి.
ఒక్క సారిగా చికెన్, గుడ్డు ధరలు పెరుగుదలతో విక్రయాల పైన ప్రభావం పడింది. ధరల పెరుగుదల వెనుక వ్యాపారులు అనేక కారణాలు చెబుతున్నాయి. ఈ ధరలు మరి కొంత కాలం ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.చికెన్, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ఏకంగా రూ.300కి చేరుకుంది. కోళ్ల ఫామ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా మారింది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర రూ.50 మేర పెరిగింది. గతంలో రూ.250కే కేజీ బాయిలర్ చికెన్ లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.300కి చేరుకుంది. దీంతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి. ఏప్రిల్‌లో రూ.4 ఉన్న గుడ్డు, మే నాటికి రూ.5 అయింది. జూన్ మొదటి వారంలో రూ.6 దాటి.. ఇప్పుడు జూన్ చివరి వారానికి వచ్చేసరికి ఏకంగా రూ.8 కి చేరింది. ఈ జోరు చూస్తుంటే త్వరలోనే ఒక్కో గుడ్డు ధర రూ.10 కు చేరుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మండి పోయాయి. ఆ తీవ్రమైన వేడిని తట్టుకోలేక సుమారు 10 శాతం కోళ్లు చనిపోయాయి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి పడిపోయిందని వివిరిస్తున్నారు.కిషన్ రెడ్డి, రామ్మోహన్ కు కొత్త శాఖలు- తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్.. అవుట్..!?వినియోగదారుల పైన ప్రభావంఅదే విధంగా పౌల్ట్రీ నిర్వాహకులకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మొన్నటి వరకు పశ్చిమాసియాలో జరిగిన యుద్ధ వాతావరణం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులు నిలిచి పోయి .. పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.292 వద్ద కొనసాగుతోండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.259కి చేరుకుంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.140 పలుకుతుండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.167గా ఉంది. ఇక 12 కోడి గుడ్ల రిటైల్ ధర రూ.88గా ఉంది. అదే విధంగా ఏపీలోనూ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.298గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.264గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.143, రిటైల్ లైవ్ బర్డ్ రూ.170 పలుకుతోంది. ఇక 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.90 పలుకుతున్నాయి. మరి కొద్ది రోజులు ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.