గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈ వారం అంతా సుందరి హవానే సాగింది. బావా అంటూ వచ్చి ఇంట్లో నానా హంగామా చేసింది. ఇక సుందరి ఓవర్ యాక్షన్ చూసి మీనాకు ఒళ్లు మండిపోయినట్టుంది.
బావా అని సుందరి పలవడం, బాలు తెగ సిగ్గు పడిపోవడంతో మీనాకి మండుకొచ్చేసింది. ఇంకో వైపు జీఎస్టీ నోటీసులను లైట్ తీసుకున్న మనోజ్‌కు షాక్ తగిలింది. జీఎస్టీ అధికారులు షాప్‌కి వచ్చి సీజ్ చేస్తామని చెప్పారు. మూడు గంటల్లో మూడు లక్షలు కట్టాల్సిందే అని వార్నింగ్ ఇస్తారు. దీంతో మూడు లక్షల్ని సెట్ చేసేందుకు రోహిణి నానా తంటాలు పడుతుంది.ఇంకో వైపు సుగుణమ్మని, చింటుని స్కూల్ వద్ద బాలు చూసేస్తాడు. చింటు గాడు అయితే బాలుని చూసి ఫుల్ ఖుషీ అవుతాడు. తప్పించుకోవాలని సుగుణ ట్రై చేస్తుంది. అదే టైంలో రోహిణి కూడా ఫోన్ చేస్తుంటుంది. చివరకు చింటు కోసం దాచి పెట్టిన నగల్ని కూడా తాకట్టు పెడుతుంది రోహిణి. ఇక సుందరి పెళ్లి విషయం దగ్గరకు వస్తుంటుంది. ఓ పెళ్లి సంబంధాన్ని రంగా చూస్తాడు. కానీ సుందరి మాత్రం ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పదు. తీరా పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్లు వస్తున్నారు అనగా సుందరి ఒంటి నిండా నగలు వేసుకుని ఇంట్లోంచి జంప్ అవుతుంది. దీంతో కామాక్షి గుండె బద్దలు అవుతుంది. జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో కొన్న నగలు పోయాయ్ అని కంగారు పడుతుంది కామాక్షి.🔹‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్ : నీ పని నువ్వు చూసుకో.. నా విషయాల్లో తలదూర్చకు.. ఇందుకి రాజు వార్నింగ్ఇక బాలు తన తెలివితో సుందరి కూపీ లాగుతాడు. సుందరి ప్రేమికుడు కిషోర్ ఇంట్లోనూ వారి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కిషోర్ మేనమామ మాణిక్యం మాత్రం అటు సైడ్ నుంచి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తాడు. రంగారావు ఇంటికి వచ్చి మరీ మాట్లాడతాడు మాణిక్యం. ఆ టైంలో బాలు అక్కడ ఉండడు. ఒక వేళ బాలు, మాణిక్యం ఎదురు పడితే రోహిణి మలేషియా నాటకం బట్టబయలు అవుతుంది. పెళ్లి అయ్యేలోపు ఈ బాంబ్ ఎప్పుడు పేలుతుందా? అని ఆడియెన్స్ ఎదురు చూడాల్సిందే.రోహిణి ఏమో ఇప్పుడే తనకున్న సమస్య తీరిందని, ఇక జీఎస్టీ అధికారుల గోల తప్పిందని అనుకుంటుంది. కానీ సుందరి రూపంలో మరో సమస్య వస్తోందని రోహిణికి తెలియడం లేదు. ఒక వేళ సుందరి పెళ్లితో మాణిక్యం దొరికిపోతాడని, తద్వారా తన గుట్టు కూడా రట్టవుతుందని రోహిణికి తెలిస్తే ఏం చేస్తుందో చూడాలి. మున్ముందు మరింత ఆసక్తికరంగా ఎపిసోడ్స్ సాగబోతోన్నట్టు కనిపిస్తోంది.