
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
US Attacks Iran Again: మళ్లీ మొదటికే వచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగడం లేదు, మళ్ళీ అమెరికా ఇరాన్ మీద విరుచుకుపడింది. ఒకవైపు గల్ఫ్ దేశాలు తమపై ఇరాన్ దాడి చేస్తుందేమో అని భయపడుతుంటే, మరోవైపు ఇండియా వంటి దేశాలు మళ్ళీ చమురు, గ్యాస్ కష్టాలు వస్తాయేమో అని టెన్షన్ పడుతున్నాయి. అమెరికా మిలిటరీ ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు మిస్సైల్ స్టోరేజ్ ఫెసిలిటీపై దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఇలా డైరెక్ట్ అటాక్ జరగడం ఇదే మొదటిసారి. సింగపూర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసినందుకు ట్రంప్ ఖండించిన కొద్దిసేపటికే అమెరికా ఇలా అటాక్ చేయడం గమనార్హం.
హార్ముజ్ స్ట్రెయిట్ పంతమే కారణమా? అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి ఒక కారణం ఉందని నిపుణులు అంటున్నారు. హార్ముజ్ స్ట్రెయిట్ అంతర్జాతీయ జల సంధి, అది ఎవరి ఆధీనంలో ఉండకూడదని అమెరికా పంతం పడుతోంది. ఇరాన్ తాము చెప్పిన రూట్ లో వెళ్లలేదని, సింగపూర్ షిప్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. హార్ముజ్ నుండి నౌకలు ఎలాంటి టోల్ లేకుండా ఫ్రీగా వెళ్లవచ్చని ట్రంప్ చెప్పారు. కానీ ఇరాన్ ఇలా దాడులు చేయడంతో, ఆ జల సంధిపై తమ పట్టును నిరూపించుకోవడానికి అమెరికా ఇలా ప్రతి దాడికి సమాధానం ఇస్తోంది.
యూఎస్ బేస్‌లను టార్గెట్ చేశాం... మరోవైపు తాము కూడా అమెరికా స్థావరాలను టార్గెట్ చేశామని ఇరాన్ చెప్పింది. అమెరికా దాడులను ఖండించిన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, స్థానిక రీజియన్‌లో యూఎస్ మిలిటరీ పొజిషన్లపై టార్గెట్ చేసినట్లు ప్రకటించింది. అయితే ఎక్కడ అటాక్ చేస్తారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనివల్ల రెండు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోయింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇది ఒక సెమీ అఫీషియల్ న్యూస్ కావడంతో వారు పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ కూడా చేశారు. ఒకవేళ నిజంగానే ప్రతికార దాడులు మొదలైతే ఫుల్ స్కేల్ వార్ వచ్చే అవకాశం ఉంది.
హార్ముజ్ అలజడి... శాంతి ఒప్పందం కుదిరి కొద్ది రోజులే అయినా, ఇరు దేశాల మధ్య నమ్మకం లేకపోవడం తెలిసిందే. నౌకల రాకపోకలు సాఫీగా జరుగుతున్నా, హార్ముజ్ దాటుతున్న సింగపూర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసింది. తాము చెప్పిన రూట్ లో వెళ్లాలని ఇరాన్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ అటాక్ జరిగింది. కానీ, పెద్దన్న మాత్రం హార్మూజ్ అంతర్జాతీయ జలసంధి.. దానిపై ఎవరూ అధిపత్యం చేయకూడదని అన్నారు. ఇక ఇది యుద్ధానికి దారితీస్తుందా అనే చర్చ అప్పుడే మొదలైంది, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేసినట్లు కన్ఫర్మ్ అయిపోయింది.
ఇరాన్ దాడి.. మళ్ళీ గ్యాస్ కష్టాలు! ఇలా అమెరికా, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే ప్రపంచం అంతా దెబ్బతినక తప్పదు. మళ్ళీ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయేమో అని అందరూ టెన్షన్ పడుతున్నారు. హార్ముజ్ జల సంధిపై పట్టు కోసం ఇరు దేశాల మధ్య పోరు జరుగుతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధం మొదలవుతుందేమో అన్న ఆందోళన మొదలైంది. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ నుండి దాడులు వస్తాయేమో అని భయపడుతున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హార్ముజ్ విషయంలో జరుగుతున్న ఈ పంతం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ఉంది. గ్యాస్ నిల్వలు తగ్గిపోతాయేమో, పెట్రోల్, డీజిల్ ధరలు ఏమౌతాయో అని అందరూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.