
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డె (Cabo Verdy) చరిత్ర సృష్టించింది. కేవలం 5.30 లక్షల జనాభా కలిగిన ఈ అతిచిన్న దేశం ఇప్పుడు వరల్డ్ కప్ నాకౌట్‌కు చేరుకుని అద్భుతం చేసింది.
తొలిసారి ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేదు. అయినా, రౌండ్ 32కు చేరుకొని వార్తల్లో నిలిచింది. గ్రూప్ Hలో స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కాబో వెర్డె బరిలోకి దిగింది. స్పెయిన్ మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానం సాధించి నాకౌట్‌కు వెళ్లింది. కాబో వెర్డె మాత్రం మూడు డ్రాలు చేసుకుని రెండో స్థానంతో ముందుకు దూసుకెళ్లింది. నాకౌట్లో అర్జెంటీనాతో తలపడనుంది. మరోవైపు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఉరుగ్వే ఓటమిపాలైంది. దీంతో సౌదీ అరేబియాతోపాటు ఉరుగ్వే ఇంటిముఖం పట్టాయి.
ఫిఫా ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్‌కు తిరుగులేదు. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ Iలో అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకుంది. నార్వేతో జరిగిన పోరులో ఫ్రాన్స్ ఆటగాడు ఉస్మాన్ డెంబెలె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఆట మొదలైన 7వ నిమిషంలో గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు ఆధిక్యం అందించాడు. మళ్లీ 20వ నిమిషంలో గోల్‌తో ఆ జట్టు 2-0 లీడ్‌లోకి వెళ్లింది. అయితే, ధెలో అస్గార్డ్ 21వ నిమిషంలో గోల్‌తో నార్వేను రేసులోకి తీసుకొచ్చాడు. కానీ, 32వ నిమిషంలోనే డెంబెలె హ్యాట్రిక్ గోల్‌తో 3-1 ఆధిక్యం సాధించింది. ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా.. డిసైర్ డౌయ్ (90+4వ నిమిషం) గోల్‌తో ఫ్రాన్స్ 4-1 తేడాతో నార్వేపై విజయం సాధించింది. ఇదే గ్రూప్ నుంచి సెనెగల్ 5-0 తేడాతో ఇరాక్‌ను ఓడించింది. దీంతో ఫ్రాన్స్, నార్వే, సెనెగల్ నాకౌట్‌కు దూసుకెళ్లాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.