
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Shani Trayodashi: నవగ్రహాల్లో శనిదేవుడికి మంద గమనుడు అని పేరు. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్లు పడుతుంది. ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శని దేవుడు అమ్మ నాన్నల ప్రేమను భక్తులపై చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు నిలువెత్తు ప్రతీక. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే మనకున్న చెడు తొలికి మంచి జరగుతుందని విశ్వాసం. అంతేకాదు ఏల్నాటి శని.. అర్ధాష్టమ శనితో బాధపుడుతన్న వారు.. శని దేవుడి యోగం నడిచే కాలంలో శనివారం వచ్చే త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నువ్వులు నూనె నల్లబట్టతో అభిషేకం చేస్తే అన్ని శుభాలే అని శాస్త్రం చెబుతున్న మాట.
అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి. ఎలా చేయాలి. తెలుసుకుందామా...?
శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేస్తాడనేది ప్రతీతి. శని దేవుడి మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజా తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది.
శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.
ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.ఆ రోజు మద్య ,మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో గడపాలి. అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.ఎవరితోను వాదనలకు దిగరాదు. ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శనిదేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని ,ఆపధ కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.