
భారతీయ అపర కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతో పాటు ఇతర నింది
తులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో మరింత స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదికను సమర్పించాల్సిందిగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ (న్యాయ శాఖ)ను కోర్టు ఆదేశించింది.బ్రూక్లిన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న జస్టిస్ డిపార్ట్మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా, ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలు, కారణాలతో కూడిన నివేదికను జులై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు.భారత్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదం కోసం ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని, అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉంది.మే నెలలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కేసుపై మరింత సమయం, వనరులను కేటాయించలేమని పేర్కొంటూ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జస్టిస్ డిపార్ట్మెంట్ భావించింది. జూన్ 24న అదానీ తరపు న్యాయవాదులు కూడా ఈ కేసు అమెరికా అధికార