
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Saturn Mars 60 Degree Conjunction Telugu News: వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక గ్రహాలు కలిసి వివిధ యోగాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ యోగాలు అన్ని రాశుల పైన ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే 2026 జూలై 19వ తేదీన ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు. కుజ శని గ్రహాల కలయిక కారణంగా.. ఒక దానికి ఒకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఎంతో శక్తివంతమైన లాబదృష్టి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆనందంతో పాటు శ్రేయస్సు ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన వృద్ధి కూడా పెరగడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరబోతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి లభించబోతా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వీరికి ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అయితే, ఈ మూడు రాశుల వారికి లాభదృష్టి రాజయోగం అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి లాభాలే.. మేషరాశి శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల నాలుగు రాశుల వారిలో ముఖ్యంగా మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.. ఈ కాలంలో వైవాహిక జీవితంలో అద్భుతమైన ప్రశాంతత లభించబోతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో విపరీతమైన పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల తో మంచి పరిచయాలు ఏర్పడి పదోన్నతులు కూడా వారి నుంచి పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సహుద్యోగులు కూడా పనిలో మీకు తోడు ఉండడం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ ధన లాభాలు కూడా పొందగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అదృష్టం విపరీతంగా లభిస్తుంది.
వృశ్చిక రాశి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అదృష్టాన్ని కలిగించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా.. మానసిక సమస్యలు తొలగిపోబోతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగి శారీరక బలం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు శత్రుత్వం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు అందరితో స్నేహంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు తప్పకుండా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీని కారణంగా వీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే అన్ని సమస్యలు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి..
మకర రాశి మకర రాశి లో జన్మించిన వ్యక్తులకు కూడా శని కుజ గ్రహాల ప్రభావం ఊహించని స్థాయిలో పడుతుంది. దీని కారణంగా వీరికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. వీరికి ఊహించని స్థాయిలో అదృష్టం కూడా కలిసి రాబోతోంది. ఈ సమయంలో కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. వీరి జీవితం పై విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుని అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పాత పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా గొప్ప పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా విపరీతంగా ఏర్పడి అవసరమైన ఒత్తిడిని వదిలేసుకునే అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇతరులతో మంచి సమయాన్ని గడుపుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.