
Mars And Mercury Conjunction July 2026: కుజ, బుధ రెండు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణాల్లోకి రాబోతున్నాయి. దీని కారణంగా ఈ సమయం లో ఎంతో శక్తివంతమైన ద్వాదశరాజయోగం ఏర్పడుతుంది.
ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో మేలు చేయబోతోంది. ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది.
Mars And Mercury Conjunction July 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహ సంచారాలకు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కుజుడు బుధ వంటి గ్రహాలు సంచారం చేస్తే అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే జూలై నెలలో ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఈ కోణంలోకి రాబోతున్నాయి.
జూలై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బుధ, కుజ గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీనికి కారణంగానే ద్వాదశ రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఈ శక్తివంతమైన ద్వాదశ రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి వృత్తిపరంగా గొప్ప విజయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు కాబోతోంది.. అనుకుంటున్న పనుల్లో మాట తీరుతో సులభంగా విజయాల సాధిస్తారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి..
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన ద్వాదశరాజయోగం కారణంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి ఈ సమయంలో తెలివితేటలు కూడా విపరీతంగా పెరిగి.. కొన్ని రకాల పనుల్లో విజయాలు సాధించబోతున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత లభించి సమాజంలో గౌరవం లభించబోతోంది.
బుధ, కుజ గ్రహాల కలయిక కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా పదోన్నతులు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.
నేను రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన శుభయోగ ప్రభావంతో మంచి మంచి అవకాశాలు కలుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పూర్తిగా ముగిసి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా వ్యాపారాల విషయాల్లో ఘననీయమైన విజయాలు సాధిస్తారు. నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి..