
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Sun Transit In Pushya Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడి నక్షత్ర మార్పుకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. రాబోయే జూలై 20, సోమవారం ఉదయం 11:33 గంటలకు ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలకు కారకుడైన సూర్య దేవుడు తన స్థానాన్ని మార్చుకుని పుష్య నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు.
ఆగస్టు 3వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. సూర్యుడి ఈ నక్షత్ర మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి (Leo) సింహ రాశికి అధిపతి సూర్యుడే కావడం వల్ల ఈ నక్షత్ర సంచారం వీరికి అద్భతమైన లాభాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.. ధన లాభం కలగడం వల్ల మానసిక ప్రశాంతత కూడా సులభంగా లభించబోతోంది..
వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి జీవితంలో సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి.. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏదైనా పెద్ద సమస్య లేదా ప్రమాదం నుంచి స్నేహితుల సహాయంతో సురక్షితంగా బయపడే అవకాశాలు ఉన్నాయి.. ఆఫీసులో పెద్ద బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries) మేష రాశివారికి సూర్యుని నక్షత్ర సంచారంతో పనితీరులో అద్భుతమైన విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది.. వృత్తి జీవితంలో మెరుగైన అవకాశాలు కలుగుతాయి. మీ శ్రమకు కార్యాలయంలో అద్బుతమైన గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి.. సామాజికంగా మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius) ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం ఒక వరం లాంటిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివిధ మార్గాల నుంచి వీరు తప్పకుండా ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో పెద్ద పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి మీ వ్యాపార లేదా వృత్తి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.