
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: గతకొన్నాళ్లుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1, 42, 760గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 860వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండికి 100 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధరరూ. 2,45,100గా ట్రేడ్ అవుతోంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో: తెలంగాణ వ్యాప్తంగా బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలలో ఒకే ధరలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,760 లుగా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,860 గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,070 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో: ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు తిరుపతిలలో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,42,760 కి లభిస్తుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,860 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,070 వద్ద విక్రయిస్తున్నారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో: దేశవ్యాప్తంగా చూసుకుంటే చెన్నైలో పసిడి ధరలు అత్యంత గరిష్టంగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,45,100 గా, 22 క్యారెట్లు రూ.1,33,010 గా, 18 క్యారెట్లు రూ.1,10,760 లుగా నమోదైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,960 ఉండగా, 22 క్యారెట్లు రూ.1,31,060 18 క్యారెట్లు రూ.1,07,270 గా ఉంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,860, 22 క్యారెట్లు రూ.1,30,960, 18 క్యారెట్లు రూ.1,17,170 లుగా పలుకుతోంది. ఇక ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాలలో మాత్రం తెలుగు రాష్ట్రాల తరహాలోనే 24 క్యారెట్లు రూ.1,42,760, 22 క్యారెట్లు రూ.1,30,860, 8 క్యారెట్లు రూ.1,07,070 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మార్కెట్ డేటా ప్రకారం ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.44 లక్షల వద్ద ముగియగా, కిలో వెండి ధర రూ. 2.22–రూ. 2.23 లక్షల మధ్య ట్రేడ్ అయింది. రోజంతా బంగారం, వెండి రెండూ బలహీనంగానే ఉండి.. ధరలు తక్కువ స్థాయిల వద్ద ముగిశాయి. ఇటీవలి కాలంలో కీలక మద్దతు స్థాయిగా పరిగణిస్తున్న రూ. 1,44,000 కంటే బంగారం ధర ఇంట్రాడేలో దిగువకు పడిపోయింది.
ప్రపంచ మార్కెట్ ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి. ఇటీవల కామెక్స్‌లో బంగారం ఔన్సుకు $4,000 సమీపంలో తడబడింది. వెండి కూడా పతనం తర్వాత కొద్దిగా కోలుకుంది. బలమైన డాలర్, అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాలు బంగారం మెరుపును తగ్గించాయి.
బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? * డాలర్ సూచీ బలపడింది * యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు * పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు * ప్రపంచ అనిశ్చితి తగ్గుముఖం పట్టింది
ఈ కారకాలన్నీ కలిసి బంగారం, వెండిపై ఒత్తిడి తెచ్చాయి.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.