
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Business Ideas: నేటి కాలంలో చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలతోపాటు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణ ఫలం పంట సాగు అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఎందుకంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో మార్కెట్లో ఈ పండుకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉండడంతో పాటు తక్కువ పెట్టుబడి అధిక లాభాలను ఇస్తున్న ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లక్ష్మణ ఫలాని ఇంగ్లీషులోసౌర్ సాప్ అని పిలుస్తుంటారు. ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు ఇది ఒక ఔషధ గని అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ చెట్టు ఆకులను పలు రకాల శారీరక రుగ్మతలకు తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించడంతో ప్రజలు ఈ పండును. ఆకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న యజమానులకు మంచి ఆదాయం లభిస్తుంది అని చెప్పాలి.
మాంగోస్టీన్ వంటి ఇతర అరుదైన పండ్ల మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరగడం కష్టమే.. అయినప్పటికీ లక్ష్మణ ఫలం మాత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వాతావరణంలో అద్భుతంగా పెరుగుతుంది. ఉష్ణ మండలం, ఉప ఊష్ణ మండల పరిస్థితులు ఈ మొక్కకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. నేలలో నీటి నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉంటే చాలు ఈ చెట్లు ఏపుగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో వీటిని నాటడం వల్ల మొక్కలు త్వరగా వేర్లు పట్టుకొని స్థిరపడతాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.
లక్ష్మణ ఫలం మొక్కలను నాటి మూడు నుండి నాలుగు సంవత్సరాల్లోనే దిగుబడి ప్రారంభమవుతుంది. మొక్కల మధ్య మూడు నుండి నాలుగు మీటర్ల దూరం పాటిస్తే గాలి సూర్య రశ్మీ బాగా అందుతాయి. అయితే లక్ష్మణ ఫలం సాగులో నాణ్యమైన అంటుకట్టిన మొక్కలను ఎంచుకోవడం దిగుబడిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాలి. అయితే వీటిని ప్రభుత్వం నర్సరీ నుండి లేదా నమ్మకమైన సంస్థల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వేసవికాలంలో మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి. అయితే వేర్ల దగ్గర నీరు నిలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చెట్లు ఫలసాయానికి సిద్ధమయ్యే లోపు తోటలోని ఖాళీ ప్రదేశాలను సద్వినియోగం చేసుకుంటూ కూరగాయలు లేదా పపాయా వంటి స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రైతులు తమ భూమిలో వైవిధ్యం కోసం ఈ లక్ష్మణ ఫలాన్ని సాగు చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఆదాయం పొందుతున్నారు. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న ఈ కాలంలో ఇలాంటి అరుదైన పంటలకు మార్కెట్లు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీ తోటలో ఒక భాగంలో నైనా ఈ మొక్కలు నాటి వ్యవసాయాన్ని లాభం సాటిగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.