
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే ఇంటి వరకే కాకుండా మనం నాటుకునే మొక్కలపై కూడా వాస్తు ప్రభావం అనేది ఉంటుంది
అని చెబుతుంటారు వాస్తు నిపుణులు. మరి ఇంటి ముందు ఎలాంటి రంగు ఉన్న గులాబీ మొక్క ఉండటం వాస్తు ప్రకారం కలిసి వస్తుందో తెలుసుకుందాం.
అయితే చాలా మంది తమ ఇంటి ముందు ఎరుపు రంగు, గులాబీ రంగు, తెలుపు రంగు, పసుపు రంగు, కాషాయం రంగు గులాబీ మొక్కలను నాటుకుంటారు. ఇక ఇవన్నీ కూడా చాలా మంచివి. కానీ, ఎక్కువగా ఇంటి ముందు ఎరుపు లేదా తెలుపు రంగు గులాబీ మొక్కను నాటుకోవడం మంచి అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
వాస్తు ప్రకారం చూస్తే ఎరుపు రంగు లక్ష్మీదేవికి చాలా ప్రీతి కరమైనది. అంతే కాకుండా ఎరుపు రంగు ఇంటికి చాలా మంచిది, ప్రతి కూల శక్తిని తొలిగించి, ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. అందువలన ఇంటిలో ఎరుపు రంగు గులాబీ మొక్క నాటుకోవడం మంచిది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అంతే కాకుండా తెలుపు రంగు గులాబీ మొక్క కూడా చాలా మంచిదంట. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువలన ఇంటిలో తెలుపు రంగు గులాబీ మొక్కను నాటుకోవడం అన్ని విధాలుగా చాలా మంచిది. అని చెబుతున్నారు వాస్తు పండితులు. ఇక వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా గులాబీ మొక్కలు ఇంటికి నైరుతి దిశలో నాటాలంట. దీని వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు