డిజైన్స్ వేద్దామని రాజు ఇచ్చిన సలహాతో ఇందు ట్రై చేస్తుంది. రాజు కూడా ఏవేవో డ్రాయింగ్స్ వేసేందుకు ట్రై చేస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇది డ్రాయింగా? అని గేలి చేసుకుంటారు.
నీకు కనీసం ముగ్గులు వేయడం, మెహెందీ పెట్టడం వచ్చా.. అని రాజు అంటాడు. హా వచ్చు అని ఇందు అంటుంది. అవి వచ్చినప్పుడు కనీసం కాస్తైనా డ్రాయింగ్ బాగా వేయొచ్చు కదా? అని కౌంటర్ వేస్తాడు. స్కూల్లో చిన్నప్పుడు వేయలేదా? అని.. ఓ.. నువ్వు స్కూలుకే వెళ్లలేదు కదా.. ఇంట్లో బోల్లు కడుగుతూ చదువుకున్నావ్ కదా అని అంటాడు రాజు. ఇంతలో అపర్ణా దేవీ వచ్చి వారి డ్రాయింగ్ చూసి తిడుతుంది. మిమ్మల్ని నమ్మి ఈ కంపెనీ చేతిలో పెట్టాను చూడు నాది తప్పు, ఈ నాలెడ్జ్‌తో కంపెనీని ఎలా ముందుకు తీసుక వెళ్తారో ఏంటో అని అంటుంది. నాకు అమ్మలా టాలెంట్ లేకపోవచ్చు.. కానీ టాలెంట్ ఉన్న వారిని బాగా వాడుకోవడం వచ్చు అని ఇందు అంటుంది. అవును అమ్మ.. వాడుకోవడం బాగా వచ్చు అని రాజు కౌంటర్లు వేస్తాడు. ఇంతలో శ్రుతి ఒక మంచి డిజైన్ పంపిస్తుంది. దానికి కొన్ని కరెక్షన్స్ చెబుతుంది ఇందు.బ్లాక్ మెయిల్ చేసిన రేఖ.. డిజైన్స్ పూర్తి చేశాావా? అని శ్రుతికి ఫోన్ చేస్తుంది రేఖ. కంప్లీట్ అయ్యాయి మేడం.. అని అంటుంది. కానీ వాటిని రేపు నువ్వు ఆఫీసుకి తీసుకు రావొద్దు.. చివరి నిమిషం వరకు వాళ్లని నువ్వు నమ్మిస్తూనే ఉండాలి.. కానీ రేపు ఆ డిజైన్స్ కంప్లీట్ అవ్వొద్దు.. డీల్ క్యాన్సిల్ అవ్వాలి అని రేఖ అంటుంది. అలా ఎందుకు మేడం.. అని శ్రుతి అంటే.. మీ అమ్మని బతికించుకోవాలని లేదా? హాస్పిటల్ బిల్ అంతా నేనే కడతాను.. అమ్మ కోసం ఈ మాత్రం చేయలేవా? అమ్మ కోసం ఏం చేసినా తప్పు లేదు.. ఇంత చిన్న పని చేయలేవా? అని శ్రుతిని బ్లాక్ మెయిల్ చేస్తుంది రేఖ.అర్దరాత్రి పూట రాజు.. రాజు అర్దరాత్రి నిద్ర లేస్తాడు. ఈ ప్రశ్నలతో మనశ్శాంతిని నిద్రపోలేకపోతోన్నా అని అంటాడు. ఇక ఇందు పడుకుందో లేదు రెండు,మూడు సార్లు టెస్ట్ చేస్తాడు రాజు. ఆమె దగ్గరకు వెళ్లి మరీ చూస్తాడు. ఇక ఇందు మంచి నిద్రలోనే ఉందని రాజు అనుకుంటాడు. డోర్ తీసుకుని రాజు బయటకు వెళ్తున్నప్పుడు ఇందు కూడా నిద్రలేస్తుంది. ఇంత రాత్రి పూట రాజు ఎటు వెళ్తున్నాడు.. ఏం చేస్తున్నాడు అని ఇందు అనుకుంటుంది. రాజు కారిడార్‌లో ఉంటే.. డోర్ వద్ద ఉండి ఇందు అన్నీ వింటూ ఉంటుంది.నీ పని నువ్వు చూసుకో.. డాక్టర్‌కి ఫోన్ చేసి తన పేషెంట్ గురించి డీటైల్స్ కనుక్కుంటాడు. ఇదంతా ఇందు వింటుంది. హాస్పిటల్లో ఎవరున్నా మీ అమ్మా? నాన్నా? తమ్ముడా? లక్కీనా? అని ఇందు అంటుంది. అవన్నీ నీకు ఎందుకు.. అది నా పర్సనల్ విషయం.. నా విషయాల్లో దూరకు.. మైండ్ యువర్ బిజినెస్ అని అంటాడు రాజు. అంటే మన మధ్య ఏం లేదా? అని ఇందు అడుగుతుంది. ఏం లేదు అని కోపంగా రాజు అంటాడు. ఉంది.. అద్దె మొగుడు.. అంత వరకే మన రిలేషన్ అని రాజు అంటాడు.పేమెంట్ కరెక్ట్‌గా ఇవ్వు.. నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నావ్.. నీకు కూడా నేను సాయం చేస్తాను కదా అని ఇందు అంటుంది. నాకు నీ సాయం ఏమీ వద్దు.. కావాలంటే నువ్వు సరిగ్గా టైంకి పేమెంట్ ఇవ్వు.. నా పరిస్థితి నీకు అర్థమైంది.. కదా అని రాజు అంటాడు. చావు బతుకుల సమస్య అంటావ్ అది ఇదేనా? అని ఇందు అడుగుతుంది. అవన్నీ నీకు అనవసరం..నా పేమెంట్ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వు చాలు అని రాజు అంటాడు. దీంతో ఇందు అయోమయంలో పడిపోతుంది. సమస్య ఏమై ఉంటుందా? అన్నట్టుగా ఇందు ఓ చూపు చూస్తుంది.కంగారు పడ్డ రాజు, ఇందు.. ఆఫీసులో క్లైంట్ హర్ష వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఇంకా శ్రుతి రాకపోవడంతో ఇందు, రాజు కంగారు పడుతుంటారు. మీరు ఇలా కంగారు పడటమే కదా నాకు కావాల్సింది అని రేఖ అనుకుంటుంది. ఏంటి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు.. శ్రుతి కోసమా? అని రేఖ అంటుంది. అది నీకు ఎలా తెలుసు? ఏమైనా చేశావా? ఏంటి అని రాజు అడుగుతాడు. డిజైన్స్ కోసం క్లైంట్ వెయిట్ చేస్తున్నాడు.. ఇంకా ఆ డిజైనర్ రాలేదు.. అంటే మీరు ఆమె కోసమే వెయిట్ చేసేది అని రేఖ అంటుంది. అవును ఆమె టైంకి వస్తుంది.. డీల్ ఓకే అవుతుంది అని రాజు అంటాడు.రౌడీలను పురమాయించిన రేఖ.. ఇంకో వైపు శ్రుతి ఇంటి వద్ద పురమాయించిన రౌడీలకు రేఖ ఫోన్ చేస్తుంది. శ్రుతి ఎక్కడుంది.. మీరు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు? అని అడుగుతుంది. ఉదయం నుంచి ఆమె ఇంటి ముందే ఉన్నాం.. ఆమె లోపలే ఉంది మేడం అని చెబుతారు. ఏదైనా తేడా వస్తే మాత్రం మిమ్మల్ని లేపేస్తా అని రేఖ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఆ ఇద్దరూ మరీ ముందుకు, దగ్గరగా వెళ్లి గమనిద్దామని అనుకుంటారు. ఇంటి గోడ దగ్గరకు వస్తారు.. అదే టైంలో శ్రుతి చెత్త తీసుకు వచ్చి వేస్తుంది. అది ఆ ఇద్దరి రౌడీల మీద పడుతుంది.రౌడీలతోో శ్రుతి.. అయ్యో చూసుకోలేదండి అని ఆ రౌడీలను అమాయకంగా నటిస్తూ మాట్లాడుతుంది శ్రుతి. నాకు ఒక రెండు నిమ్మకాయలు తీసుకు వచ్చి ఇస్తారా? సమ్మర్ కదా.. నిమ్మకాయ నీళ్లు తాగితే వేడి తగ్గుతుంది అని అంటుంది శ్రుతి. నేను వెళ్లి తీసుకుని రానా? మీరు వెళ్తారా? అని అడుగుతుంది. దీంతో ఆ ఇద్దరూ వెళ్లి నిమ్మకాయలు తీసుకు వస్తారు. మాక్కూడా నిమ్మకాయ రసం చేసి ఇవ్వండని రౌడీలు అడుగుతారు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూస్తుంటే ఆ ఇద్దరినీ బురిడీ కొట్టించి.. ఆమె కరెక్ట్ టైంకి ఆఫీసులో అడుగు పెట్టి రేఖకు షాక్ ఇచ్చేలా ఉంది.