బాదం-నిమ్మ ఫేస్ ప్యాక్ తయారీ కోసం బాదం పప్పులు, నిమ్మరసం, తేనె, పాలు కావాలి. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతాయి.
ముందుగా బాదం పప్పులను నీళ్లలో నానబెట్టండి. తర్వాత వాటి తొక్కలను తీసి పేస్ట్‌లా తయారు చేయండి.
బాదం పేస్ట్‌లో నిమ్మరసం, తేనె, పాలు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి.
శుభ్రంగా కడిగిన ముఖానికి బాదం-నిమ్మకాయ పేస్ట్‌ను సున్నితంగా అప్లై చేయండి. ముఖం, మెడ భాగానికి సమానంగా అప్లై చేయండి.
ఈ ఫేస్ మాస్క్‌ను 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఫేస్ మాస్క్‌ను క్లీన్ చేస్తున్న సమయంలో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. దీని వల్ల అందం రెట్టింపు అవుతుంది.
బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. అందాన్ని పెంచుతాయి.
బాదం-నిమ్మకాయ ఫేస్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.