
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నా శరీరం నా ఇష్టం అని అనుకుంటే వాడి కళ్లు వాడి ఇష్టం.
Jun 26 2026 7:20 PM | Updated on Jun 26 2026 7:43 PM
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నా శరీరం నా ఇష్టం అని అనుకుంటే వాడి కళ్లు వాడి ఇష్టం. అవతలి వాళ్లని కంట్రోల్ చేసే బదులు మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందించింది. ఇలా మాట్లాడటం మహిళల్ని మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అన్నారు. వీటికి కౌంటర్ ఇచ్చిన సునీత.. ఓ వీడియో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)
'నాపై చిన్నయికి ఎంత గౌరవం ఉందో ఆమెపై నాకు అంతే గౌరవం ఉంది. మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అన్నారు. 'నా శరీరం నా ఇష్టం' అనే దానికి అర్థమేంటో నాకు తెలుసు. ఒకరి నియంత్రణలో ఉండకపోవడం. నేను వ్యక్తిగా పుట్టాను కాబట్టి నా శరీరంపై పూర్తి బాధ్యత, పూర్తి అర్హత నాదే. ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకూడదు. ఇలా రకరకాల అంశాలు దీనిచుట్టూ ఉన్నాయి. అవి నాకు తెలుసు. నేను ఎందుకు అలా అన్నానంటే అలాంటి సమాజంలో మనమున్నాం. అంతే కానీ నా చేయి నా ఇష్టం అంటే వెళ్లి చేతులు విరగ్గొట్టేవాళ్లలో నేను ముందుంటాను. నేనెప్పుడు మిస్ లీడింగ్‌గా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మొత్తం వీడియో చూడండి. మీరు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా. నాకు అది ఓకే కాదు' అని సునీత చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ)
శోభిత మాన్సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు)
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్