నేటి డిజిటల్ జనరేషన్లో డార్క్ సర్కిల్స్ సమస్య కామన్‌గా మారిపోయింది. చాలామంది ఈ డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు.
డార్క్ సర్కిల్స్ వల్ల మన ముఖం అందం దెబ్బతినడమే కాకుండా డల్‌గా కనిపిస్తుంటుంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ సమస్య గంటల తరబడి ఫోన్ స్క్రీన్స్ చూస్తూ ఉండటం, రాత్రిపూట ఆలస్యంగా టీవీ చూడటం, స్క్రీన్ చూస్తూ సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యల వల్ల వస్తుందని మనకు తెలిసిన విషయమే.అయితే కొందరు డిజిటల్ స్క్రీన్స్ చూడటం తగ్గించిన, రాత్రిపూట బాగా నిద్రపోయినప్పటికీ డార్క్ సర్కిల్స్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిద్రలేమి, డిజిటల్ స్క్రీన్ మాత్రమే కాకుండా డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయని Cleveland Clinic పేర్కొంది. ఈ కారణాలు తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి నిద్రలేమి, ఫోన్ చూడటం కాకుండా ఇంకేం కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం..వంశపారంపర్యంగా కూడా..కొంతమందికి వంశపారంపర్యంగా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సౌత్ ఏషియా, మెడిటేరియన్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు జన్యుపరమైన కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. వీరిలో కళ్ల కింద మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుండటంతో చిన్న వయస్సు నుంచే డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉందట.చర్మం పలచబడటం వల్లశరీరంలోని అన్ని చర్మ భాగాల్లో కంటే కళ్ల కింద చర్మం చాలా పలచగా ఉంటుంది. ముఖంలోని ఇతర భాగాల్లో చర్మం దాదాపు 2 మి.మీ. మందంతో ఉండగా, కళ్ల కింద చర్మం సుమారు 0.5 మి.మీ. మందంతో మాత్రమే ఉంటుంది. చర్మం పలచబడే కొద్దీ దాని కింద ఉన్న రక్త నాళాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రక్త నాళాల వల్ల నీలి, ఊదా, గోధుమ రంగు మచ్చలు ఏర్పడవచ్చు. వయసు పెరిగేకొద్దీ చర్మం మందం, సాగే గుణం మరింత తగ్గి కళ్ల కింద నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.అలెర్జీలుఅలెర్జీల కారణంగా కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని అందరూ నిర్లక్ష్యం చేస్తారు. అలర్జిక్ రినైటిస్ కారణంగా కళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల కళ్లు మరింత నల్లగా కనిపిస్తాయి. పుప్పొడి, ధూళి, పెంపుడు జంతువుల జుట్టు, కాలుష్యం వంటివి అలర్జిక్ రినైటిస్ను ట్రిగ్గర్ చేస్తాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి అలెర్జీకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.రక్తహీనత, పోషకాహార లోపాలుపోషకాహార లోపం కారణంగా కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఇది కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ను మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. విటమిన్ బి12, విటమిన్ సి లోపాలు కూడా స్కిన్ టోన్ తగ్గడానికి, అలసటకు, కొల్లాజెన్ ఉత్పత్తికి కారణం అవుతాయి. కాబట్టి ఆహారంపై శ్రద్ధ పెట్టడం, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్‌ను తగ్గించవచ్చు.డీహైడ్రేషన్, సూర్యరశ్మి వల్ల కూడా.. డీహైడ్రేషన్ వల్ల చర్మం కాంతిహీనంగా, లోపలికి కుంగిపోయినట్లు కనిపిస్తుంది. చర్మం పొడిబారితే కళ్ల కింద వలయాలు మరింత ముదురుగా కనిపించవచ్చు. అందుకే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఇది శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటుంది. అంతే కాకుండా ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నా కూడా డార్క్ సర్కిల్స్ సమస్య ఇబ్బంది పెడుతుందట. కాబట్టి ఎండకి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.