TDS On Salary : ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగిపై కంపెనీ చేసే ఖర్చు మొత్తం లెక్కించి శాలరీ ప్యాకేజీ (CTC) నిర్ణయిస్తారు.
అందులోంచి ప్రావిడెంట్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ సహా ఇతర కట్టింగ్స్ ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితుల ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే శాలరీ ప్యాకేజీ ఉన్నట్లయితే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) అనేది కట్ చేస్తారు. కంపెనీ ప్రతి నెలా టీడీఎస్ కట్ చేసిన తర్వాత జీతం ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. శాలరీతో పాటు బోనస్, అలవెన్సులు, ట్యాక్స్ పరిధిలోకి వచ్చే గిఫ్టుల వంటి వాటిపై టీడీఎస్ కట్ చేస్తారు. అయితే, ఇది ప్రతి ఉద్యోగికి ఒకే విధంగా ఉండదని గుర్తుంచు కోవాలి.ఉదాహరణకు ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి వేతన ప్యాకేజీ రూ. 15 లక్షలుగా ఉందని అనుకుందాం. అప్పుడు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం చూసుకున్నా సదరు ఉద్యోగి పన్ను పరిధిలోకి వస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు సహా ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారు ప్రతి ఏడాది జులై 31 వ తేదీ లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రతి నెలా కట్ చేసే టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైలింగ్ ఒక్కటే మార్గం. మరి రూ. 15 లక్షల ప్యాకేజీ ఉంటే కనిష్ఠంగా ఎంత టీడీఎస్ కట్ అవుతుంది, కొత్త, పాత పన్ను విధానాల ప్రకారం అంచనా లెక్కలు ఓసారి తెలుసుకుందాం. రూ.15 లక్షల వేతనంలోని అంశాలు పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం బేసిక్ శాలరీ రూ.5,62,500 రూ.5,62,500 డీఏ రూ.1,87,500 రూ.1,87,500 ఇతర శాలరీ కాంపోనెంట్స్ రూ.7,50,000 రూ.7,50,000 గ్రాస్ పే రూ.15,00,000 రూ.15,00,000 స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 రూ.75,000 చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ రూ.72,000 - హాస్టల్ ఖర్చు అలవెన్స్ రూ.2,16,000 - పన్ను పరిధిలోకి వచ్చే శాలరీ రూ.11,62,000 రూ.14,25,000 సెల్ప్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ నుంచి నష్టం రూ.2,00,000 - సెక్షన్ 80సీ డిడక్షన్ రూ.1,50,000 - సెక్షన్ 80సీసీడీ(2) రూ.75,000 రూ.1,05,000 సెక్షన్ 80సీసీడీ (1బీ) రూ.50,000 - సెక్షన్ 80డీ హెల్త్ ఇన్సూరెన్స్ రూ.50,000 - నెట్ ట్యాక్సేబుల్ శాలరీ రూ.6,37,000 రూ.13,20,000 మొత్తం కట్టాల్సిన పన్ను రూ.41,500 రూ.81,120 నెలకు కట్ అయ్యే టీడీఎస్ రూ. 3,458 రూ. 6760