
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన పాట, వాయిస్‌తో ప్రేక్షకుల మదిలో ఎంతగా గుర్తుండిపోతుందో.. వివాదాల్లోనూ అంతే!
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద 9Chinmayi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన పాట, వాయిస్‌తో ప్రేక్షకుల మదిలో ఎంతగా గుర్తుండిపోతుందో.. వివాదాల్లోనూ అంతే! తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే! ఇలాంటి ఘటనలపై సినిమా తీయాలని నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను (Rahul Ravindran)ఓ నెటిజన్ కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘మన సొసైటీలో ఎన్నో ఏళ్లుగా మహిళల్ని ఎదగనివ్వకుండా చేసే వ్యవస్థ ఒకటి నడుస్తోంది. నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు నిశ్శబ్దంగా బాధపడటం నేను గమనించా. అలాంటి కథతోనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తీశా. బయట జరుగుతున్న దాన్ని అందులో చూపించాను. ఇలాంటి ఆసక్తికరమైన కథ ఏదైనా దొరికితే భవిష్యత్తులో సినిమా తీస్తా. కానీ ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా తీస్తానేమో. కానీ, పురుషులపై మహిళలు చేసే నేరాలంటూ జనరలైజ్ చేసి తీయను. నా దృష్టిలో ఆ రెండింటికీ చాలా తేడా ఉంది’ అని రాహుల్ అన్నారు.
Bahubali 3: ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. ఇదే విషయంపై చిన్మయి స్పందిస్తూ ‘రాహుల్ అందరిలా ఆలోచించరు. ఇలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు’ అని పోస్ట్ చేయగా దానికి ఓ నెటిజన్ ‘అందరికీ వంట చేేస వాళ్లు దొరకరు’ అంటూ వెటకారంగా పెట్టిన కామెంట్‌పై చిన్మయి మండిపడ్డారు. ‘ఇంట్లో అమ్మ చేసే వంటను కొందరు చులకనగా చూస్తారు. అవమానకరంగా మాట్లాడే వారు చాలమంది మనలో ఉన్నారు. పెద్ద పెద్ద హోటల్స్‌లో చెఫ్‌లు అంతా మగవారే. వంటను కేవలం మహిళలకే పరిమితం చేయొద్దు’ అన్నారు.
Bhagyashri Borse: భాగ్యశ్రీ.. సైలెంట్‌గా సౌత్‌ను దున్నేస్తుందిగా!
Demonte Colony 3:‘డిమాంటి కాలనీ-3’.. రిలీజ్ డేట్ వచ్చేసింది
Naveen Polishetty: పాన్ ఇండియా దర్శకులతో కాస్ట్లీ ఫ్రేమ్..