
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, మరో వ్యక్తి మాయం చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు...
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, మరో వ్యక్తి మాయం చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించినట్లు సమాచారం.సీఐ నాగరాజుతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, సీఐ సన్నిహితుడు సురేశ్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నాగరాజు అరెస్ట్ అనంతరం వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లగా, ప్రస్తుతం వారి కోసం సిట్ అధికారులు గాలింపు చేపట్టారు. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో ఆచూకీ కనుగొనడం సవాల్‌గా మారింది.ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుకు అశోక్ అసిస్టెంట్‌గా వ్యవహరించినట్లు సమాచారం. అలాగే నాగరాజు పేరు చెప్పుకొంటూ ప్రైవేట్ వ్యవహారాలు నిర్వహించడంలో జంగం నాని కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు అక్రమాల ఆరోపణలు రావడంతో గతంలో అతణ్ని పీఆర్‌కు పంపినట్లు సమాచారం. ఇటీవలే అతడికి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పోస్టింగ్ లభించింది.మరోవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని హోంమంత్రి అనిత తెలిపారు. త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు.