పచ్చని కొండలు, కాఫీ తోటలు, జలపాతాలతో చాలా బాగుంటుంది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. హంపి కూడా చాలా మంచి ప్రదేశం.
విజయనగర సామ్రాజ్యపు అద్భుత శిల్పకళ, పురాతన దేవాలయాలను చూసి రావచ్చు.
గోకర్ణ చాలా బాగుంటుంది. ప్రశాంతమైన బీచ్‌లతో అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ దేవాలయాలు, సూర్యాస్తమయ సమయంలో కనిపించే దృశ్యాలు బాగా ఆకట్టుకుంటాయి.
పచ్చని కొండలు, కాఫీ తోటలతో ఈ హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది. వీలైతే వీకెండ్ ప్లాన్ చేసుకుని ఒకసారి వెళ్లి రండి.
తేలియాడే మేఘాల అందాలను వీక్షించాలంటే కొడైకెనాల్ అద్భుతమైన ప్రదేశం. వీకెండ్ సరదాగా వెళ్లి చిల్ అవ్వచ్చు.
సముద్రతీర దేవాలయాలు, రాతి శిల్పాలు, బీచ్ అందాలతో మహాబలిపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీరు మీ ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి వెళ్లొచ్చు..
ఫ్రెంచ్ స్టైల్లోని వీధులు, మంచి బీచ్‌లు, ప్రశాంతమైన కెఫేలతో పాండిచ్చేరి చాలా బాగుంటుంది. వీకెండ్‌కు సరదాగా వెళ్లి రావచ్చు.
దేశంలోని ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. నల్లమల్ల అడవుల అందాలతో చాలా బాగుంటుంది. సరదాగా వీకెండ్లో వెళ్లి రావచ్చు.
అధిక వర్షపాతం, దట్టమైన అడవులతో ఉన్న అగుంబేను సరదాగా సెలవు రోజు చూసి రావచ్చు. ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక గమ్యం ఇది.