
మారుతున్న జీవనశైలి మహిళల్లో అనేకరకాల వ్యాధులకు కారణం అవుతోంది. మూడు పదులు దాటాక ఒక్క దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా... కాలక్రమంలో దానికి రెండు మూడు తోడవుతున్నాయి.
ఇలా వచ్చే వ్యాధుల్లో అధికరక్తపోటు, డయాబీటీస్, గుండెజబ్బులు ముఖ్యమైనవి.
మారుతున్న జీవనశైలి మహిళల్లో అనేకరకాల వ్యాధులకు కారణం అవుతోంది. మూడు పదులు దాటాక ఒక్క దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా... కాలక్రమంలో దానికి రెండు మూడు తోడవుతున్నాయి. ఇలా వచ్చే వ్యాధుల్లో అధికరక్తపోటు, డయాబీటీస్, గుండెజబ్బులు ముఖ్యమైనవి. ఇవి మీ జీవితంలో భాగం కాకూడదన్నా, ఇప్పటికే వీటి బారిన పడినవాళ్లు నియంత్రణలోకి తెచ్చుకోవాలన్నా ‘డాష్ డైట్’ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. డాష్ అంటే అధిక రక్తపోటును ఆపడానికి వీలైన ఆహార పద్ధతులు (డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్) అని అర్థం. దీనిలో పోషకాలు అధికంగా ఉండే సంపూర్ణ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సోడియం, కొవ్వులు, అదనపు చక్కెర్లను తగ్గిస్తూ పోషకాలు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే దీని ప్రత్యేకత. దీనిలో కెలోరీలను లెక్కించాల్సిన అవసరం లేదు. అయితే సాధారణ బియ్యం కంటే... బ్రౌన్‌రైస్, ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్ వంటి వాటిపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడే పండ్లనూ ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను వంటివి మితంగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్ నూనెను వాడాల్సిందిగా సిఫార్సు చేస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఈ డైట్ సహాయపడుతుంది. బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువే. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, పక్షవాతం వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఏ ఆహారాన్ని ఎంత మొత్తంలో తినాలి అనేది మీ బరువు, ఆరోగ్యం, జీర్ణక్రియ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.