
సమంత ఇటీవలే అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. మా ఇంటి బంగారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది
Jun 26 2026 11:45 AM | Updated on Jun 26 2026 12:17 PM
సమంత ఇటీవలే అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. మా ఇంటి బంగారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాకుండా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానని మరో గుడ్ న్యూస్ పంచుకుంది. ఈ ప్రకటనతో సామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ నందిని రెడ్డి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సమంత ప్రెగ్నెన్సీపై ఆమె మాట్లాడారు. మా ఇంటి బంగారం షూటింగ్లో ఉన్నప్పుడే సామ్‌కు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని నందని రెడ్డి తెలిపింది. ఈ విషయం సెట్లో కేవలం నాకు మాత్రమే తెలుసని పేర్కొంది. కానీ అప్పటికే యాక్షన్ సీన్స్ మొత్తం కంప్లీట్ చేశామని నందిని వెల్లడించింది. అందువల్ల షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది రాలేదని వివరించింది. మిగిలిన షూట్‌కి సమంతకి కొంచెం ఎక్కువ విశ్రాంతినిస్తూ పూర్తి చేశామని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.
కాగా.. మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సమంత తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్ మరో సర్ప్రైజ్! (ఫొటోలు)
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
నల్గొండ : ఎల్లమ్మకు బోనం సమర్పించిన మహిళలు (ఫొటోలు)
‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్ పిక్స్ చూశారా?
ఓరి మీ దుంపతెగా.. ఇదేం ప్రీవెడ్డింగ్ షూట్ రాబాబూ!
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది