
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఫిలిప్పీన్స్ (Philippines)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మిందనౌలో శుక్రవారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) భూకంప లోతును 29 కిలోమీటర్లుగా నివేదించింది. భూప్రకంపనలు రావడంతో ప్రభావిత తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు.. తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరాలు వెలువడాల్సి ఉంది. కొన్ని వారాల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించడంతో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది మిస్సింగ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.