
తమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది.
తమిళ సంస్కృతిలో మేనమామ సారె పెట్టే సంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, 'తైమామన్ తంగ మోదిరం తిట్టం' (మేనమామ బంగారు ఉంగరం పథకం) పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 755.83 కోట్లు ఖర్చు చేయనుంది. దీని ద్వారా సంవత్సరానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే దాదాపు 4.42 లక్షల మంది శిశువులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజైన జూన్ 22, 2026 నుంచి జన్మించిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పెరరిజ్ఞర్ అన్నా జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15, 2026న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పారదర్శకమైన కొనుగోళ్ల కోసం వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (TNMSC) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.ఇటీవలి ఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కజగం (TVK) ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా కుటుంబాలకు అండగా నిలవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్‌కు ఈ పథకం అదనపు బలాన్ని చేకూర్చనుంది.నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలుఈ పథకంపై ఆరోగ్య రంగ నిపుణులు, ప్రతిపక్షాలతో పాటు అధికార కూటమిలోని మిత్రపక్షం నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత