
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) లో జరిగిన విరాళాల దుర్వినియోగం కేసులో ముప్పేట విమర్శలు ఎదుర్కొంటున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ చర్యలు ప్రారంభించింది.
వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రామ మందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారం తమ మెడకు చుట్టుకోవడంతో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. సిట్ నివేదిక మేరకు 8 మందిపై నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.అయోధ్య రామాలయంలో విరాళాల గోల్ మాల్ ? యోగీ సర్కార్ సంచలన నిర్ణయం..!శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ఫిర్యాదు మేరకు అయోధ్యలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను, మనీష్ యాదవ్, లవ్‌కుశ్ మిశ్రా, కరుణేష్ పాండే, రామ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లాతో సహా 8 మంది వ్యక్తులు, అలాగే మరికొందరు అపరిచితులపైనా కేసు నమోదైంది. సిట్ ప్రాథమిక విచారణ, శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ దాఖలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5)తో సహా పలు నిబంధనల కింద ఈ కేసు నమోదు చేశారు.అయోధ్య గుడిలో 200 కోట్ల చోరీ- సర్కారే కూలిపోతుందన్న కేజ్రివాల్..! అయితే ఈ ఎఫ్ఐఆర్ ను అన్యాయానికి నిదర్శనమని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఇందులో శక్తివంతులైన నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో అన్యాయం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఇందులో చిన్నవారిని శిక్షిస్తారని, పెద్దవారిని వదిలేస్తారని తెలిపారు. ముందు సిట్ పేరుతో సాక్ష్యాలన్నింటినీ తొలగించి, ఏ పెద్ద తలకాయలను కాపాడాలో, ఎవరిని ఇరికించాలో నిర్ణయించుకున్నాకే ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ప్రజలు అంటున్నారన్నారు. బహుశా ముందే నివేదికను సిద్ధం చేసి ఎస్‌ఐటీకి ఇచ్చి, దానికి అనుగుణంగానే దర్యాప్తు జరిపి ఉంటారన్నారు. అంటే ముగింపును ముందే ఖరారు చేసుకున్నారన్నమాట అన్నారు.