సుందరి గురించి వివరాలన్నీ కనుక్కుని బాలు, మీనా వస్తారు. రంగారావుకి అసలు విషయం చెప్తారు. కామాక్షి మాత్రం తన నగల గురించే ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు..
మీ పెద్దల అంగీకారం కోసం చూస్తున్నారు.. మీరు ఓకే అంటేనే మీ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటారట.. ఆ అబ్బాయితో మాట్లాడాం.. నాకు మంచివాడిలానే అనిపించాడు.. అని బాలు అంటాడు. అమ్మాయిని లేపుకెళ్లినోడు మంచోడు ఏంట్రా అని రంగారావు అంటాడు. మా రవి గాడు కూడా లేపుకెళ్లాడు కదా అని బాలు అంటాడు. పిల్లలు ఇష్టపడ్డారు.. పిల్లల ఇష్టాన్ని కాదనకూడదు అని బాలు నచ్చజెపుతాడు. ఇదే విషయం కాస్త ముందుగా చెప్పొచ్చు కదా అని సుందరి గురించి రంగా బాధపడతాడు. నీకు చెప్పేందుకు భయపడింది.. నీ మీద గౌరవం లేక కాదు బాబాయ్ అని మీనా అంటుంది. మేం వెళ్లి ఆ పిల్లాడి ఇంట్లో మాట్లాడి వస్తాం అని బాలు, మీనా అనుకుంటారు. అదే టైంలో రంగారావుతో మాట్లాడేందుకు మాణిక్యం కూడా వస్తాడు. కానీ ఒకరికొకరు ఎదురు పడరు. బాలు, మీనా నేరుగా కిషోర్ ఇంటికి వెళ్తారు. కిషోర్ తండ్రికి పరిస్థితిని అర్థమయ్యేలా బాలు చెప్పేందుకు ప్రయత్నిస్తారు.ఒప్పించిన బాలు, మీనా కిషోర్ ఇంటికి బాలు, మీనా వెళ్తారు. కిషోర్ తండ్రికి నచ్చజెపుతారు. ఇప్పుడు కోపంతో పెళ్లి ఒప్పుకోరు.. మనం ఒప్పుకోకపోయినా వాళ్లు పెళ్లి చేసుకుంటారు.. మనవడు పుట్టాక మీ కోపాలు పోతాయి.. కొన్నేళ్ల తరువాత మీరు ఈ పెళ్లిని మీ చేతుల మీద జరిపించలేదని బాధపడతారు.. వాళ్లకి కూడా తల్లిదండ్రుల చేతుల మీదుగా పెళ్లి జరగలేదనే బాధ ఉంటుంది.. అదంతా ఎందుకు.. వాళ్లకి మీ మీద గౌరవం ఉంది కాబట్టే.. ఇంకా పెళ్లి చేసుకోకుండా మీ అనుమతి కోసం చూస్తున్నారు అని బాలు చెబుతాడు. ఇంతలో మాణిక్యం ఫోన్ చేసి రంగారావు ఫ్యామిలీ చాలా మంచిది.. వాళ్లు కూడా పిల్లల సంతోషమే కోరుకుంటున్నారని చెబుతాడు. దీంతో కిషోర్ తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకుంటారు.ఇంటికి తీసుకు వచ్చిన బాలు.. సుందరిని బాలు, మీనా ఇంటికి తీసుకు వస్తారు. బోసిగా వచ్చిన సుందరిని చూసి కామాక్షి కంగారు పడుతుంది. నా బంగారం పోయిందని బాధపడాలా? నువ్వు వెళ్లావ్ అని బాధపడాలా? అని సుందరిని కామాక్షి తిడుతుంది. మీ బంగారం ఇదిగోండి అని బ్యాగ్‌ను ఇస్తుంది మీనా. ఇక కామాక్షి తన నగల్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకో వైపు రంగా కాళ్ల మీద సుందరి క్షమించమని కోరుతుంది. ఇదే విషయం ముందుగా చెప్పి ఉంటే.. నా మాట కూడా పోయేది కాదు కదా అమ్మా అని రంగా అంటాడు. అప్పుడు భయం వేసింది పెద నాన్నా అని సుందరి అంటుంది.మీరే పెళ్లి పెద్దలుగా.. పిల్లలు మన గౌరవాన్ని కాపాడారు.. ఇంట్లోంచి వెళ్లినా పెళ్లి చేసుకోలేదు.. వాళ్ల పెళ్లి మనం చేయాలి అని బాలు అంటాడు. అబ్బాయి వాళ్ల ఇంట్లోంచి కూడా వచ్చి మాట్లాడారు.. మనం వీళ్ల పెళ్లి చేద్దాం.. మీరే పెళ్లి పెద్దలుగా ఉండాలి.. ఈ విషయాలు ముందే మీ బావకి చెప్పినా.. అందరికీ సర్ది చెప్పేవాడు కదమ్మా అని సుందరితో రంగా అంటాడు. ఇప్పుడు నా నగలు అన్నీ వచ్చాయి.. ఇప్పుడు చెప్పండి.. ఏం చేద్దామో అని తీరిగ్గా అంటుంది కామాక్షి. దీంతో రంగాకి మరింత కోపం వస్తుంది.ప్రభావతి విసుర్లు.. రాచకార్యాలు వెలగబెట్టి వచ్చారా? ఊరిని ఉద్దరించి వచ్చారా? మీరు లేకపోతే ఈ ప్రపంచం ఏం అవుతుందో అని వెటకారంగా అంటుంది ప్రభావతి. ఓ రెండు జీవితాల్ని కాపాడారు.. వీళ్లు చేసింది గొప్ప పని అని సత్యం పొగుడుతాడు. పారిపోయిన ఇద్దరినీ తీసుకు వచ్చారు.. అంతే కదా.. వీరేదో ఘన కార్యం చేసినట్టుగా చెబుతున్నారేంటి అని ప్రభావతి అంటుంది. మరి మనోజ్ గాడు పారిపోయినప్పుడు నువ్వేం చేయలేదు ఎందుకు.. నీకు చేతకానిది మేం చేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతోన్నావ్ అని ప్రభావతికి బాలు కౌంటర్లు వేస్తాడు. దీంతో ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీరు మంచి పనే చేశార్రా అని సత్యం మరోసారి మెచ్చుకుంటాడు.అన్నీ నేనే పెడతాను.. రంగారావు ఇంటికి మాణిక్యం వచ్చి మాట్లాడతాడు. మీ సుందరి మా వాడ్ని మాయ చేసింది.. పెద్దలకు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో.. అవకాశం ఉండి కూడా పెద్దల వాళ్ల కోసం ఆగారు.. వీళ్లు చాలా మంచి వాళ్లు అని మాణిక్యం అంటాడు. పిల్లలు బాగుంటే చాలు అని మాణిక్యం, రంగా అంటారు. మా కూతురికి ఏం పెట్టాలి.. బీరువా వంటివి పంపిస్తాం అని రంగా అంటాడు. అవన్నీ మాకు వద్దు.. కోడలు వస్తే చాలు.. బీరువాలు కాదు.. ప్రేమను తీసుకు రావాలి.. సుందరి నాక్కూడా కూతురే అవుతుంది.. అవన్నీ నేను చూసుకుంటాను అని మాణిక్యం అంటాడు.మనమంతా బంధువులం.. చాలా మంచి మాట చెప్పారు అని మాణిక్యంని రంగా, కామాక్షి పొగిడేస్తుంటారు. మీ ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి ఎవరో.. ఆయన లేకపోతే ఇదంతా జరిగేది కాదు.. అని మాణిక్యం అంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ మంచి వారు.. వాళ్లు తల్చుకుంటే ఏ పనైనా చేయగలరు.. అని రంగారావు, కామాక్షి అంటారు. వాళ్లకి ఫోన్ చేస్తాను.. మీరు కూడా కలుద్దురు అని అంటాడు రంగా. వద్దులేండి.. ఇకపై మనమంతా బంధువులమే.. కలుస్తూనే ఉంటాం.. నిన్నంతా తిరిగి రెస్ట్ తీసుకుని ఉంటుంటారు.. అని మాణిక్యం అంటాడు. సరే అని రంగా కూడా అంటాడు.తుమ్ములతో భయపెట్టిన బాలు, మీనా జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను మనోజ్ తీసుకొస్తాడు. అన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి అని రోహిణి అనుకుంటుంది. అంతలోనే తుమ్ముతూ బాలు, మీనా వస్తుంటారు. ఇదేంటి ఇలా తుమ్ముతున్నారు.. సరిగ్గా ఇదే టైంకి అని రోహిణి కంగారు పడుతుంది. ఇక ఇంతలో ప్రభావతి కూడా వస్తుంది. ఏంటి అలా తుమ్ముతున్నారు అని అడుగుతుంది. ఇవి మనకు చెప్పి వస్తాయా? ఏంటి? తుమ్మావతి అని ప్రభావతికి కౌంటర్లు వేస్తాడు బాలు. మనం వెళ్దాం పదా రోహిణి అని మనోజ్ తన భార్యని తీసుకుని వెళ్లిపోతాడు. ఆడపిల్లవి అయి ఉండి ఇలా తుమ్ముతున్నావ్ ఏంటి? అని మీనాని అడుగుతుంది ప్రభావతి.ప్రభావతిపై శ్రుతి కౌంటర్లు.. తుమ్ముకి, దగ్గుకి, తిండికి ఆడ, మగ అన్న తేడా ఉండదు అని బాలు చెబుతుంటే శ్రుతి వస్తుంది. భలే చెప్పావ్ బాలు అని శ్రుతి పొగిడేస్తుంది. సరే కానీ ముందు నాకు కాఫీ ఇవ్వు అని మీనాని దబాయిస్తుంది ప్రభావతి. నీకు కూడా కాఫీ కావాలా? శ్రుతి అని మీనా అడుగుతుంది. నాకు కాదు.. కానీ ముందు ఆంటీకి ఇవ్వు లేకపోతే.. ఇల్లంతా రచ్చ చేస్తుందని శ్రుతి అంటుంది. మా అమ్మ గురించి నీకు బాగానే తెలిసి వచ్చింది అని బాలు అంటే.. ఏడాదిగా ఉంటున్నా.. ఆ మాత్రం తెలియదా? అని శ్రుతి వెళ్లిపోతుంది. ఇక కాఫీ పెట్టేందుకు మీనా కూడా వెళ్తుంది.Screenshot 2026-06-26 074752 ప్రభావతి వస్తుందని తెలిసి కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది చింతామణి. చూశావా ఇన్ని రోజులు లేచి నిలబడేది ఇప్పుడు కాలు మీద కాలేసుకుని ఉంది.. అని కామాక్షికి చెబుతుంది ప్రభావతి. సుందరి పెళ్లి బాలు, మీనాల వల్లే జరుగుతోంది.. అని కామాక్షి అంటుంది. ఇక్కడ కూడా వాళ్ల భజనేనా అన్నట్టుగా ప్రభావతి అంటుంది. నిజం చెప్పుకోవడంలో తప్పు ఏంటి.. నువ్వు ఒప్పుకోవు అంతే అని అంటుంది కామాక్షి. ఇక కొత్త స్టెప్పులు నేర్పిస్తా అని చింతామణితో ప్రభావతి అంటుంది. నాకేం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చింతామణి అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి