కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ' వెంకట్రామయ్య గారి తాలూకా '. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ...
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త చిత్రం ' వెంకట్రామయ్య గారి తాలూకా '. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో చిత్ర టీజర్, పాటల ఆవిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న బంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను ఈ చిత్రంలో హృద్యంగా చూపించబోతున్నారు. తండ్రి సెంటిమెంట్‌తో పాటు కుటుంబ విలువులకు అద్దం పట్టేలా ఈ కథను మలిచినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ ప్రధాన పాత్రలు పోషించారు. * ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై ‘మిల్క్ బ్యూటీ’ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ... ‘'వెంకట్రామయ్య గారి తాలూకా' చిత్రం ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుంది. కథ నచ్చడంతోనే నా కూతురు దివిజను ఇందులో నటించమని ప్రోత్సహించాను. డాక్టర్ కావాల్సిన మా అమ్మాయి ఈ రోజు నటిగా మారుతోంది. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’ అని అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ... "ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా, కళ్లలో నీళ్లు తెప్పించేలా ఈ సినిమా ఉంటుంది. నా కెరీర్లో నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్న అద్భుతమైన పాత్ర ఈ చిత్రంలో లభించింది’ అని చెప్పుకొచ్చారు. * బాబాయ్‌కి అబ్బాయ్ సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్-చరణ్ ఫోటోలు దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ... "జర్నలిజం నేపథ్యం నుంచి రావడం వల్ల బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ ప్రతిభను చూసి ఈ పాత్రకు ఎంపిక చేశాం. మన దేశ సంస్కృతిలో పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని, కుటుంబ సమస్యల పరిష్కారాలను ఇందులో చూపించాం" అన్నారు. "మధ్యతరగతి కుటుంబాల్లో మేము చూసిన నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎన్నో సవాళ్లను దాటుకుని నిర్మించాం. 'హనుమాన్' చిత్రం లాగే మా సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం" అని నిర్మాతలు కోమలి, మహేందర్ తొట్టె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ తొలి ప్రయత్నంగా వస్తున్న ఈ చిత్రాన్ని జూలై 18న థియేటర్లలో చూసి ఆదరించాలని హీరోయిన్ దివిజ ప్రభాకర్ ప్రేక్షకులను కోరారు. విడుదలైన టీజర్, పాటలకు ఇప్పటికే పరిశ్రమ వర్గాల నుండి, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.