
బే ఏరియాలోని సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) బే ఏరియాకు వచ్చారు.
మొన్న ఫిలడెల్పియాలో జరిగిన మాటా మహాసభల్లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరికి జనం ఉర్రూతలూగిన సంగతి తెలిసిందే. తన ఆట, పాట, సంగీతంతో అందరినీ తన్మయులను చేసే దేవిశ్రీ ప్రసాద్ బే ఏరియా విమానాశ్రయానికి వచ్చినప్పుడు బాటా నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి ఇతర నాయకులు దేవిశ్రీ ప్రసాద్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ మరియు నాగరాజ్ అన్నయ్య సంయుక్తంగా అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ అసోసియేషన్‌తో కలిసి ఈ భారీ లైవ్ కాన్సెర్ట్‌ను జూన్ 26, 2026 (శుక్రవారం)నాడు శాన్ హోసే సివిక్ వేదికగా నిర్వహిస్తున్నాయి. “బ్యాక్ ఇన్ ది బే” (Back in the Bay) పేరిట జరుగుతున్న ఈ మ్యూజికల్ ఈవెంట్ కోసం ఇప్పటికే సంగీత ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ సింగర్ల రాక ఈ సంగీత విభావరిలో కేవలం డిఎస్పీ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సింగర్లు కూడా సందడి చేయనున్నారు. సాగర్, సమీరా భరద్వాజ్, రీటా, కార్తీక్ తమ అద్భుతమైన గానంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
టికెట్ల కొనుగోలుకై… ఈ సంగీత విభావరి టికెట్ల కొనుగోలుకై వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా పోస్టర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్లు: 510-421-3535 లేదా 650-776-1203 ను సంప్రదించవచ్చు.