
ఒక్క రాత్రిలో ధనవంతులు కావాలని చాలా మంది కలలు కంటుంటారు. ముఖ్యంగా యువతలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే అలాంటి ఆశలే కొన్నిసార్లు మోసాల బారిన పడేలా చేస్తాయని జీరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. తాను కూడా కెరీర్ ప్రారంభ దశలో ఓ పిరమిడ్ స్కీమ్‌లో చిక్కుకున్నానంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.రెండేళ్లు పిరమిడ్ స్కీమ్‌లోనే..అమెరికన్ వెబ్ సిరీస్ ‘పిరమిడ్ స్కీమ్’ చూసిన తర్వాత తన గత అనుభవాలు గుర్తొచ్చాయని నితిన్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 18 ఏళ్ల వయసులో ట్రేడింగ్ కోసం డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో చేరానని చెప్పారు. దాదాపు రెండేళ్ల పాటు అందులో కొనసాగానని, తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందన్నారు.తనను ఆ వ్యాపారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి మోసం చేశాడని అనుకోవడం లేదని, అసలు కంపెనీనే వేలాది మందిని తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. తాను కూడా మరికొందరిని అందులోకి తీసుకురావడం ఇప్పటికీ బాధ కలిగిస్తుందని చెప్పారు.పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి?పిరమిడ్ స్కీమ్‌లో అసలు ఉత్పత్తి లేదా సేవ కంటే కొత్త సభ్యులను చేర్చడానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎంతమందిని తీసుకొస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతారు. భారీ లాభాలు, తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని ఆశ చూపిస్తారు. అయితే చివరికి ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోతారు.ఇప్పటికీ ఆగని మోసాలుఈ తరహా స్కీమ్‌లు గతంలోనే అంతరించిపోయాయని తాను అనుకున్నానని, కానీ ఇప్పటికీ భారత్‌లో రోజుకు రెండు కొత్త