
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు...
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గతంలో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పరిశీలించింది. విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
అలాగే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా తమ కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేసు విచారణను వాయిదా వేస్తూ తదుపరి విచారణను జూలై 22కు నిర్ణయించింది.
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..