
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత సమయం కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 25తో ముగియాల్సి ఉండగా, స్థానిక కేడర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు శాఖలకు అదనపు సమయం అవసరమని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్గ్రేడేషన్, పునర్విభజన వంటి ప్రక్రియలను చేపట్టేందుకు అవకాశం కల్పించింది. అలాగే శాఖల వారీగా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) సమావేశాలను త్వరితగతిన నిర్వహించి ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రమోషన్లు ఇవ్వని విభాగాల్లో అర్హులైన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. నాన్-సెలెక్షన్ పోస్టుల్లో అర్హత సాధించిన ఉద్యోగులకు కూడా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అవసరమైన చోట బదిలీలు, డిప్యుటేషన్లు, అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, వాటికి అవసరమైన చోట ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంశేర్ సింగ్ రావత్ పేరుతో సర్క్యులర్ జారీ అయింది. స్థానిక కేడర్ల ఏర్పాటు ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికే ప్రభుత్వం ఈ చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం