
Rohit Sharma Superstitions: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు.
అయితే కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభతో పాటు రోహిత్ సక్సెస్ వెనుక కొన్ని సీక్రెట్స్, నమ్మకాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మ్యాచ్ ప్రారంభానికి ముందు హిట్‌మ్యాన్ సెంటిమెంట్‌గా భావించి కచ్చితంగా చేసే ఆ మూడు ఆసక్తికర పనులపై ఓ లుక్కేద్దాం.
ఆటగాళ్ల నమ్మకాలు.. హిట్‌మ్యాన్ సెంటిమెంట్లు..: క్రికెట్ ప్రపంచంలో ప్రతిభ ఎంత ముఖ్యమో.. అదృష్టం కూడా అంతే కీలకమని చాలామంది ఆటగాళ్లు నమ్మతుంటారు. మైదానంలోకి అడుగుపెట్టే ముందు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు లేదా సెంటిమెంట్ ఉంటుంది. పూర్వకాలం నుంచి నేటి తరం ఆటగాళ్ల వరకు ఏదో ఒక నమ్మకాన్ని గుడ్డిగా అనుసరిస్తూనే ఉన్నారు. మన భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన రోహిత్.. ప్రతి మ్యాచ్‌కు ముందు మూడు ప్రత్యేకమైన అలవాట్లను, సెంటిమెంట్లను తూచా తప్పకుండా పాటిస్తుంటారు.
కాఫీ గ్లాసుతోనే రోహిత్ రోజు షురూ..: రోహిత్ శర్మ రోజువారీ జీవితంలో కాఫీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మ్యాచ్ ఉన్న రోజు ఉదయం నిద్ర లేవగానే హిట్‌మ్యాన్ కచ్చితంగా కాఫీ గ్లాసుతోనే తన రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఆ రోజంతా తనకు ఎంతో అదృష్టం కలిసివస్తుందని రోహిత్ బలంగా నమ్ముతారు. మ్యాచ్ రోజుల్లో కాఫీ తాగడానికి ముందే టీ లేదా ఎలాంటి పండ్ల రసాలను ముట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడరు. కేవలం వేడి వేడి కాఫీ మాత్రమే తన మానసిక స్థితిని మార్చి, మైదానంలో రాణించేలా చేస్తుందని రోహిత్ సెంటిమెంట్.
భార్య రితికకు ఫోన్ కాల్.. విజయానికి అసలు మంత్రం..: మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా.. టీమ్ మీటింగ్‌కు వెళ్లే ముందు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేకు కచ్చితంగా ఫోన్ చేస్తారు. రితికతో మాట్లాడటం రోహిత్‌కు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, మైదానంలో భారీ స్కోర్లు సాధించడానికి ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తుందని ఆయన భావిస్తారు. సాధారణంగా రితికా సజ్దే ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియంలో కూర్చుని రోహిత్‌ను ప్రోత్సహిస్తూ కనిపిస్తుంటారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆమెతో మాట్లాడటం హిట్‌మ్యాన్ విజయ రహస్యాల్లో అత్యంత ముఖ్యమైనది.
కుడికాలే ముఖ్యం.. ఒత్తిడిని జయించే రహస్యం..: ఇక మూడవ, అత్యంత ఆసక్తికరమైన సెంటిమెంట్ ఏంటంటే.. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు ఎల్లప్పుడూ తన కుడికాల్ని మొదట లోపల పెడతారు. ప్రపంచ క్రికెట్లో చాలా మంది దిగ్గజాలు ఈ కుడికాలి సెంటిమెంట్‌ను పాటిస్తారు. దీనితో పాటు, మైదానంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రోహిత్ స్టేడియంలో తనకు నచ్చిన ఒక నిర్దిష్టమైన స్థలాన్ని లేదా వైపును నిరంతరం చూస్తూ ఉంటారు. అలా చూడటం వల్ల తన మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని రోహిత్ నమ్ముతారు.